వాగులో చేపల మృత్యువాత

ABN , First Publish Date - 2021-10-25T05:21:07+05:30 IST

వాగులో చేపల మృత్యువాత

వాగులో చేపల మృత్యువాత
ఎన్కెపల్లి వాగులో మృతిచెందిన చేపపిల్లలు

చేవెళ్ల: గుర్తుతెలియని వ్యక్తులు వాగులో విష రసాయనాలు కలపడంతో వేలాది చేపలు మృతిచెందాయి. ఈ ఘటన ఎన్కెపల్లి వాగులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల మండలం రామన్నగూడ, న్యాలట, సింగప్పగూడ, కొత్తపల్లి, ఎన్కెపల్లి తదితర గ్రామాల మీదుగా వాగు ప్రవహిస్తోంది. ఈ వాగులోని నీరంతా శంకర్‌పల్లి మండలం మీదుగా గండిపేట్‌ చెరువుకు వెళ్తుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఎన్కెపల్లి సమీపంలో వాగులో క్రిమిసంహరక మందును పారబోసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాతపడ్డాయని వాపోయారు. ఈ నీరు పశువులు తాగినా చనిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. తాము సమాచారం ఇవ్వడంతో పోలీసులకు వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు నిఘా పెంయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-25T05:21:07+05:30 IST