2021లో పులుల మరణాలు అత్యధికం

ABN , First Publish Date - 2021-12-30T18:24:40+05:30 IST

దశాబ్దంలో అత్యధిక సంఖ్యలో పులుల మరణాలు

2021లో పులుల మరణాలు అత్యధికం

న్యూఢిల్లీ : ఓ దశాబ్దంలో అత్యధిక సంఖ్యలో పులుల మరణాలు 2021లో సంభవించాయి. డిసెంబరు 29 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది 126 పులులు ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో60 పులుల మరణానికి కారణం వేటగాళ్లు, ప్రమాదాలు, మానవుడు-జంతువుల మధ్య సంఘర్షణ అని వెల్లడైంది. ఈ వివరాలను జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టీసీఏ) తెలిపింది. 


ఎన్‌టీసీఏ 2012 నుంచి పులుల మరణాల లెక్కలను నమోదు చేస్తోంది. 2018లో భారత దేశంలో 2,967 పులులు ఉన్నాయని తెలిపింది. 2016లో 121 పులులు మరణించాయని పేర్కొంది. 2021 డిసెంబరు 29 వరకు 126 పులులు ప్రాణాలు కోల్పోయాయి. వీటిలో60 పులుల మరణానికి కారణం వేటగాళ్లు, ప్రమాదాలు, రక్షిత ప్రాంతాల బయట మానవుడు-జంతువుల మధ్య సంఘర్షణ అని వెల్లడించింది. 


మధ్య ప్రదేశ్‌లో 526 పులులు ఉండేవి, వీటిలో 42 పులులు మరణించాయి. మహారాష్ట్రలో 312 పులుల్లో 26 మరణించాయి. కర్ణాటకలో 524 పులుల్లో 15 ప్రాణాలు కోల్పోయాయి. ఉత్తర ప్రదేశ్‌లో 173 పులులు ఉండేవి, వీటిలో 9 పులులు మరణించాయి. ఎన్‌టీసీఏ తాజా వివరాలను తనిఖీ చేసి, మరోసారి ఈ గణాంకాలను అప్‌లోడ్ చేస్తుంది. 


Updated Date - 2021-12-30T18:24:40+05:30 IST