Philippineలో వరద విపత్తు...58మంది మృతి, 28 గల్లంతు

ABN , First Publish Date - 2022-04-13T15:55:21+05:30 IST

వేసవి ఉష్ణమండల అల్పపీడనం కారణంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన వరదల్లో 58 మంది మరణించారు....

Philippineలో వరద విపత్తు...58మంది మృతి, 28 గల్లంతు

మనీలా: వేసవి ఉష్ణమండల అల్పపీడనం కారణంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన వరదల్లో 58 మంది మరణించారు.వరదలతోపాటు కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య కనీసం 58కి పెరిగిందని, మరో 28 మంది గల్లంతయ్యారని ఫిలిప్పీన్స్ అధికారులు చెప్పారు. సెంట్రల్ లేటె ప్రావిన్సులోని బేబే నగరంలో కొండచరియలు విరిగిపడటంతో 100 మంది గ్రామస్థులు గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం ఫిలిప్పీన్స్ సైనికులు, పోలీసులు, సహాయ సిబ్బంది గాలిస్తున్నారు.వరద విపత్తు వల్ల ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం సంభవించిందని ఆర్మీ బ్రిగేడ్ కమాండర్ కల్నల్ నోయెల్  చెప్పారు.బేబే గ్రామాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి మృతదేహాలను వెలికితీశారు.భారీవర్షాలు, వరదల వల్ల సహాయ పునరావాస పనులకు ఆటంకం కలుగుతుంది.ఫిలిప్పీన్స్ దేశంలో ప్రతి ఏటా 20 తుపాన్ లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి.


Updated Date - 2022-04-13T15:55:21+05:30 IST