Assamలో వెల్లువెత్తిన వరదలు...17 మంది మృతి

ABN , First Publish Date - 2022-06-18T17:27:53+05:30 IST

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి....

Assamలో వెల్లువెత్తిన వరదలు...17 మంది మృతి

గువహటి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. భారీవర్షాలు, వరదల వల్ల ఇద్దరు చిన్నారులు సహా 55 మంది మరణించారు. ఈశాన్య ప్రాంతంలో వరద పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఎడతెగని వర్షాలు నాల్గవ రోజు అసోం ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తాయి.వరదనీటితో నదులు పొంగి ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అసోంలో ఇద్దరు పిల్లలతో సహా మరో తొమ్మిది మంది  వరదల్లో మరణించారు, ఈ సంవత్సరం వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 55 కి పెరిగింది. హోజాయ్, నల్బారి, బజలి, ధుబ్రి, కమ్రూప్, కోక్రాజార్, సోనిత్‌పూర్ జిల్లాల్లో మరణాలు నమోదయ్యాయి.హోజాయ్,సోనిత్‌పూర్‌లో కూడా ఇద్దరు వ్యక్తులు తప్పిపోయారు.


రాష్ట్రంలోని 28 జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 18.94 లక్షల మంది ప్రభావితమయ్యారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు దెబ్బతిన్నాయి. వరదలతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.మేఘాలయలోని సోహ్రా (పూర్వపు చిరపుంజి)లో శుక్రవారం ఉదయం 8:30 గంటలతో ముగిసిన 24 గంటల్లో 972 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో మౌసిన్‌రామ్‌లో 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ అధికారులు తెలిపారు.ఆకస్మిక వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో గత రెండు రోజులుగా మేఘాలయలో 18 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.


కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మలు వరద పరిస్థితిని సమీక్షించారు.రాష్ట్రంలో బ్రహ్మపుత్ర, కోపిలి, పలాదాడియా, జియా-భరాలి, మానస్, బెకి సహా పలు నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దిమా హసావోలో జలవిద్యుత్ ప్రాజెక్ట్ నాలుగు స్లూయిస్ గేట్లు తెరవడంతో కర్బీ ఆంగ్లోంగ్, మోరిగావ్, నాగావ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు.కమ్రూప్ మెట్రోపాలిటన్, బజలి, బార్‌పేట, దర్రాంగ్, గోల్‌పరా, మోరిగావ్, కోక్రాఝర్, నల్‌బరీ, ఉదల్‌గురి జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించినట్లు అసోం అధికారిక బులెటిన్ తెలిపింది.


Updated Date - 2022-06-18T17:27:53+05:30 IST