రోడ్డు విస్తరణ పనుల్లో తిరకాసు !

ABN , First Publish Date - 2021-07-25T05:49:23+05:30 IST

ప్రజలు, దాతల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేయటం చూశాం. కానీ బలవంతంగా వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసి వారి దుకాణాల ముందు తొలగించిన ఆక్రమణల స్థానంలో రోడ్డు విస్తరణ చేపట్టాలంటున్న అధికారులను మాత్రం అద్దంకిలో చూస్తున్నాం..!! ఈ విషయమై అద్దంకిలోని వ్యాపారుల మధ్య తీవ్ర చర్చనడుస్తోంది.

రోడ్డు విస్తరణ  పనుల్లో తిరకాసు !
మెయిన్‌రోడ్డులో తొలగించి ఆక్రమణలు

ఖర్చు వ్యాపారులే భరించాలని నగర పంచాయతీ అధికారుల ఒత్తిడి 

ఇదెక్కడి చోద్యమంటున్న వ్యాపారులు 



అద్దంకి, జూలై 24: ప్రజలు, దాతల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేయటం చూశాం. కానీ బలవంతంగా వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసి వారి దుకాణాల ముందు తొలగించిన ఆక్రమణల స్థానంలో రోడ్డు విస్తరణ చేపట్టాలంటున్న అధికారులను మాత్రం అద్దంకిలో చూస్తున్నాం..!! ఈ విషయమై అద్దంకిలోని వ్యాపారుల మధ్య తీవ్ర చర్చనడుస్తోంది. అద్దంకి పట్టణంలో నాలుగై దు సంవత్సరాల క్రితం విస్తరణ పనులు చేపట్టిన నగరపంచాయతీ కార్యాలయం(మెయిన్‌)రోడ్డును మరింత విస్తరించాల న్న ఉద్దేశంతో నెల రోజుల క్రితం రోడ్డుకు రెండు వైపులా షాపుల  ముందు ఉన్న మెట్లు పూర్తిగా తొలగించారు. అత్యధిక శా తం షాపుల ఫౌండేషన్‌ ఎత్తుగా ఉండటంతో దుకాణాలలోకి రాకపోకలు సాగించేందుకు ప్రత్యామ్నాయంగా చె క్కబల్లలు ర్యాంప్‌లుగా ఏర్పాటు చేసుకున్నారు. నెల క్రి తం ఆక్రమణలు తొలగించిన అధికారులు ఇంతవరకు ప నులు ఏవిధంగా చేయాలన్న విషయమై పూర్తిగా ఒక  స్పష్టతకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక  రోజు రా త్రి మెయిన్‌రోడ్డులో పొట్టిశ్రీరాములు బొమ్మ వద్ద నుంచి నగరపంచాయతీ కార్యాలయం వరకు రెండు వైపులా ఉ న్న దుకాణాల నిర్వాహకులతో నగరపంచాయతీ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణకు అ య్యే ఖర్చు ఆ ప్రాంతంలో ఉండే దుకాణాల నిర్వహకుల నుంచి వసూలు చేయాలని నగరపంచాయతీ అధికారు లు చెప్పారు. ఒక్కో అడుగుకు రూ.2 వేల చొప్పున షాపు ఎంత వెడల్పు ఉంటే అంత మొత్తం ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే ఆక్రమణల తొలగింపుతో తీవ్రంగా నష్టపోయి ఇ బ్బందిపడుతున్న వ్యాపారులు ఈ చర్యతో ఆగ్రహం వ్య క్తం చేయడంతో పాటు  తీవ్రంగా వ్యతిరేకించారు. అయి తే కొంతమంది ప్రతినిధులు మాత్రం వసూలు చేసే బా ధ్యతను తమ భుజస్కంధాల మీద వేసుకుంటామని అధికారులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వసూలు బాధ్యతను తీసుకున్న కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని వ్యా పారుల దృష్టికి తీసుకు పోగా వారు తిరస్కరించినట్లు తె లిసింది. ఈ నేపథ్యంలో వ్యాపారుల  లావాదేవీల లొసుగులను బయటకు తీసి ఒత్తిడి పెంచాలనే ఽధోరణితో ఉన్న ట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడా లేనివిధంగా రోడ్ల విస్తరణకు వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేయటం ఏ మిటని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 


శ్లాబ్‌ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం  


మెయిన్‌ రోడ్డులో సైడ్‌డ్రైన్‌ గోడలు సిమెంట్‌ రోడ్డు కం టే ఎత్తులో ఉన్నందున వాటి ఎత్తు తగ్గించి సైడ్‌ డ్రైన్‌ల పై శ్లాబులు, మ్యాన్‌ హోల్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వ నిధులతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలో పనులు ప్రారంభింస్తాం.

-రోహిణి, ఏఈ, అద్దంకి నగరపంచాయతీ


Updated Date - 2021-07-25T05:49:23+05:30 IST