తుఫాన్‌కు దెబ్బతిన్న పంటల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-20T02:48:07+05:30 IST

మండలంలో ఇటీవల తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను గురువారం జిల్లా వ్యవసాయశాఖ జేడీ సుధాకర్‌రాజు పరిశీ

తుఫాన్‌కు దెబ్బతిన్న పంటల పరిశీలన
బ్రాహ్మణక్రాకలో తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న జేడీ సుధాకర్‌రాజు

జలదంకి, మే19: మండలంలో ఇటీవల తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలను గురువారం జిల్లా వ్యవసాయశాఖ జేడీ సుధాకర్‌రాజు పరిశీలించారు. ముందుగా జలదంకిలోని వ్యవసాయశాఖ కార్యాలయానికి చేరుకున్న ఆయన వింజమూరు ఏడీఏ రామిరెడ్డితో కలిసి మండల వ్యసాయాధికారిణి శైలజ, ఎఈవోలు, వీఏఏలతో పంటనష్టాలపై సమీక్ష జరిపారు. అనంతరం క్షేత్రపరిశీలనకు వెళ్లారు. మండలంలోని బ్రాహ్మణక్రాక, బీకే అగ్రహారం గ్రామాలకు వెళ్లి అక్కడ దెబ్బతిన్న పత్తిపంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా రైతులు తమ గోడును వెళ్లబోసుకుని, తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పైరు దశ, నష్టశాతం వివరాలతోపాటు పంట నష్టం వాటిల్లిన రైతులకు సంబంధించిన పత్రాల నకళ్లు సేకరించాలన్నారు. ఈ సందర్బంగా జేడీ మాట్లాడుతూ తుఫాన్‌కు దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి, జిల్లాకలెక్టర్‌కు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తానని రైతులకు హామీ ఇచ్చారు.


Updated Date - 2022-05-20T02:48:07+05:30 IST