18 ఏళ్లు వచ్చాక అప్పు తీర్చేస్తా గడువివ్వండి

ABN , First Publish Date - 2022-06-07T08:39:00+05:30 IST

‘‘కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన నేను మైనర్‌ని, ఆదాయం లేదు.. నాకు 18 ఏళ్లు రాగానే.

18 ఏళ్లు వచ్చాక అప్పు తీర్చేస్తా గడువివ్వండి

ఎల్‌ఐసీకి కరోనాతో అనాథైన ఓ బాలిక విజ్ఞప్తి


తగిన చర్యలు తీసుకోవాలని సదరు

సంస్థను ఆదేశించిన నిర్మలా సీతారామన్‌ 

భోపాల్‌, జూన్‌ 6 : ‘‘కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన నేను మైనర్‌ని, ఆదాయం లేదు.. నాకు 18 ఏళ్లు రాగానే. మా నాన్న చేసిన అప్పు తీరుస్తా. అప్పటిదాకా గడువివ్వండి’’ గృహరుణం వసూలు కోసం తమకు నోటీసులు పంపిన ఎల్‌ఐసీ సంస్థకు వనిషా పాఠక్‌(17) అనే బాలిక రాసిన లేఖ సారాంశం ఇది. వనిషా విజ్ఞప్తికి ఎల్‌ఐసీ స్పందించలేదు. కానీ, మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఎల్‌ఐసీ, ఆర్థిక వ్యవహారాల శాఖని ఆదేశించారు.  భోపాల్‌కు చెందిన జితేంద్ర పాఠక్‌(ఎల్‌ఐసీ ఏజెంట్‌), ఆయన భార్య గతేడాది కరోనాతో మరణించారు. దీంతో వారి సంతానం వనిషా, వివాన్‌(11) అనాథలయ్యారు. పిల్లలు మైనర్లు కావడంతో జితేంద్రకి చెల్లించాల్సిన కమీషన్‌తోపాటు ఆయన పాలసీలను ఎల్‌ఐసీ బ్లాక్‌ చేసింది. కానీ జితేంద్ర బాకీ ఉన్న రూ.29 లక్షల గృహరుణం కోసం నోటీసులు పంపిస్తుంది. దీంతో, మైనర్‌ను కావడంతో తండ్రి సొమ్ము విత్‌డ్రా చేయలేనని, మేజరయ్యాక అప్పు  చెల్లిస్తానని వనిషా లేఖ రాయగా.. ఎల్‌ఐసీ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

Updated Date - 2022-06-07T08:39:00+05:30 IST