అప్పుల ఊబిలో రాష్ట్రం

ABN , First Publish Date - 2021-10-18T05:26:21+05:30 IST

సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

పెదపూడి, అక్టోబరు 17: సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ జన చైతన్య యాత్రల్లో భాగంగా కుమారప్రియంలో జరిగిన కార్యక్ర మంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లయితే అప్పునకు రూ.43 వేల కోట్లు వడ్డీగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. ముందు చూపు కొరవడడంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లబోతుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ అనపర్తి నియో జకవర్గ మహిళా అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి, పార్లమెంటరీ నియోజ కవర్గ కార్యదర్శి సానా శ్రీను, మండలాధ్యక్షుడు జుత్తుగ కృష్ణ, సర్పంచ్‌ బిరదా సత్యనారాయణ, ఎంపీటీసీ నారాయణరావు, సోషల్‌మీ డియా కన్వీనర్లు కొండేటి గోపాలకృష్ణ, కాకర సతీష్‌, ఫణీంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:26:21+05:30 IST