వెంకటకిష్ర్ణారెడ్డి మృతదేహం
కలసపాడు, జనవరి 23: శంకవరం వాసి కసింతల వెంకటక్రిష్ణారెడ్డి (33) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగెకరాల వ్యవసా య భూమికి తోడు మరో నాలుగెకరాలు కౌ లుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఇటీవల వ్యవసాయంలో రూ.10లక్షల మేర నష్టం వాటిల్లడంతో అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య వసుంధర, ఐదు, మూడేళ్ల పిల్ల లున్నారు. సంఘట నాస్థలాన్ని ఎస్‌ఐ ఘన మద్దిలేటి, వీఆర్వో బాషా పరిశీలించారు.