రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-18T04:22:23+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం రుణాలను అందజేస్తోందన్నారు.

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ కార్పొరేషన్‌ చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

బెల్లంపల్లి, జనవరి 17: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం రుణాలను అందజేస్తోందన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారులు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌  సత్యనారాయణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్వేత, వైస్‌చైర్మన్‌ సుదర్శన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ శైలేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రజిత నాయకులు  పాల్గొన్నారు. 

నెన్నెల:  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండల కేంద్రంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. పథకాల అమలుతో పేదింటి ఆడపిల్లల పెళ్లి కష్టాలను తీర్చడమే కాకుండా బాల్యవివా హాలను నియంత్రించే సామాజిక మార్పునకు దోహదపడుతుందన్నారు.  54  మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. తహసీల్దార్‌ సంపతి శ్రీనివాస్‌, ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ సింగతి శ్యామలారాంచందర్‌, ఆత్మచైర్మన్‌ సున్నం రాజు, ప్యాక్స్‌ చైర్మన్‌ మేకల మల్లేష్‌, కో ఆప్షన్‌సభ్యులు ఎండీ ఇబ్రహీం, పార్టీ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్‌,  పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T04:22:23+05:30 IST