ప్రధాన మార్కెట్లను వికేంద్రీకరించండి

ABN , First Publish Date - 2021-04-21T06:35:59+05:30 IST

తిరుపతి నగరంలోని ప్రధాన మార్కెట్లలో రద్దీ లేకుండా వికేంద్రీకరించాలని కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి రాంగోపాల్‌ అన్నారు.

ప్రధాన మార్కెట్లను వికేంద్రీకరించండి
సమావేశంలో ప్రసంగిస్తున్న రాంగోపాల్‌

కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి రాంగోపాల్‌


తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 20: తిరుపతి నగరంలోని ప్రధాన మార్కెట్లలో రద్దీ లేకుండా వికేంద్రీకరించాలని కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి రాంగోపాల్‌ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్డీవో కార్యాలయంలో కొవిడ్‌ నియంత్రణపై సమీక్షించారు. గత ఏడాది నుంచి నమోదైన కేసులను, తీసుకున్న చర్యలను కలెక్టర్‌ హరినారాయణన్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతిలో మరో వారంలో రెండువేల కేసుల నమోదుకు అవకాశం ఉందన్నారు. అందుకు అనుగుణంగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే కల్యాణ మండపాలు తదితర చోట్ల చిన్నచిన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాంగోపాల్‌ మాట్లాడుతూ.. జిల్లాకు రాష్ట్రాల సరిహద్దులు ఎక్కువగా ఉన్నాయన్నారు. బస్లాండుల్లో యాత్రికులకు ర్యాండమ్‌ ర్యాపిడ్‌ టెస్టులు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు. గతంలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఈసారి వేగవంతంగా విస్తరిస్తున్న కొవిడ్‌కు చెక్‌ పెట్టడానికి కృషి చేయాలని సూచించారు. జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-21T06:35:59+05:30 IST