తిరుపతిలో కుంగిన ఇంటి కూల్చేవేతకు నిర్ణయం

ABN , First Publish Date - 2021-11-27T21:53:51+05:30 IST

భారీ వర్షాల కారణంగా పట్టణంలోని శ్రీ కృష్ణానగర్‌లో కుంగిన ఇంటిని

తిరుపతిలో కుంగిన ఇంటి కూల్చేవేతకు నిర్ణయం

తిరుపతి: భారీ వర్షాల అనంతరం వచ్చిన భూ ప్రకంపనలకు పట్టణంలోని శ్రీ కృష్ణానగర్‌లో కుంగిన ఇంటిని కూల్చేయాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గిరీషా, అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల ద్వారా బారికేడ్లు కట్టి ఇల్లు కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధం అవుతున్నారు. అయితే తమకు తమకు న్యాయం చేసి కూల్చాలని యజమానురాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మూడు నెలల క్రితం 20 లక్షలు అప్పుచేసి ఇల్లు కట్టామని శేషయ్య, రాణమ్మ పేర్కొన్నారు. తన భర్త పేషెంట్ అని, బిడ్డలు నిరుద్యోగులని, ఇప్పుడు కూల్చేసి వెళ్ళిపోతే తమకు న్యాయం జరగదని వారు అన్నారు. నోటిమాటలు వద్దు, రాసి ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఇల్లు అమ్మి అప్పు కట్టాలని బాధితురాలు పేర్కొన్నారు. పది రోజులుగా కూలని ఇల్లు ఈ రోజు కూలిపోతుందా అని వారు ప్రశ్నించారు. తాను ఈ భవనంలో చచ్చిపోతానని శేషమ్మ బెదిరిస్తున్నారు. తమకు న్యాయం చేసి ఇంటిని కూల్చాలని బాధితులు కోరుతున్నారు. 




Updated Date - 2021-11-27T21:53:51+05:30 IST