ఈ పెన్ను ఖరీదు రూ.11 లక్షలు.. ఇంత ధర ఎందుకని అవాక్కవుతున్నారా..? దీని స్పెషాలిటీ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-16T17:46:51+05:30 IST

రాజస్థాన్‌లోని జైపూర్‌ అంతర్జాతీయ జమ్ జ్యువెలరీ...

ఈ పెన్ను ఖరీదు రూ.11 లక్షలు.. ఇంత ధర ఎందుకని అవాక్కవుతున్నారా..? దీని స్పెషాలిటీ ఏంటంటే..

రాజస్థాన్‌లోని జైపూర్‌ అంతర్జాతీయ జమ్ జ్యువెలరీ షో ఈసారి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఎగ్జిబిషన్‌లో రూ.11 లక్షల విలువైన పెన్ను ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ హార్ప్ ఆకారపు పెన్ను 22 క్యారెట్ల బంగారంతో మార్గనైట్ రాయి, బర్మీస్ టూర్మాలిన్స్, డైమండ్, ఎమరాల్డ్ పూసలతో తీర్చిదిద్దారు. ఇందులో నెమలి ఆకారాన్ని జాతిరాళ్లతో తయారు చేశారు.


మే 12 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో 48 దేశాల నుంచి 8000 మందికి పైగా కొనుగోలుదారులు వచ్చారు. 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ షోలో ఖరీదైన నగలను ప్రదర్శించారు. అలాగే కొలంబియా ఎమరాల్డ్ ఆభరణాలు వినియోగదారులకు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు 11 లక్షల పెన్‌ను చూసేందుకు జనం క్యూ కట్టారు. 


Updated Date - 2022-05-16T17:46:51+05:30 IST