స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకోండిలా!

ABN , First Publish Date - 2021-02-03T05:30:00+05:30 IST

ఇప్పటికీ కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నవారిలో జూమ్‌కాల్‌లో మాట్లాడడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల తలనొప్పి, కళ్ల అలసట, కంటి సంబంధ సమస్యలు వచ్చే అవకాశం

స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకోండిలా!

ఇప్పటికీ కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నవారిలో జూమ్‌కాల్‌లో మాట్లాడడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల తలనొప్పి, కళ్ల అలసట, కంటి సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మానసిక ఆరోగ్యం, నిద్ర మీద కూడా ప్రభావం పడే వీలుంది.  స్ర్కీన్‌ టైమ్‌ తగ్గించుకునేందుకు మానసిక నిపుణులు చెబుతున్న సలహాలివి...


సమయాన్ని గమనించాలి: మీరు కంప్యూటర్‌లో ఎక్కువ సమయం దేని కోసం కేటాయిస్తున్నారో తెలుసుకోవాలి. మీ అలవాట్లు, మీరు తరచూ చూసే డాక్యుమెంట్లు, గేమింగ్‌ టైమ్‌... ఇలా ప్రతిదానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో గమనించాలి. దాంతో మీరు ఆఫీసు పని మొదలుపెట్టగానే వీటన్నిటిని ఆపివేసేలా చూసుకోవాలి.

ప్రాధమ్యాలు గుర్తించాలి: కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయం గడపడం కన్నా మీకు ఏది ముఖ్యమో గ్రహించాలి. మీ ప్రాధమ్యాలకు, కుటుంబం, స్నేహితులు, మీ లక్ష్యాలకు ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి. ఆ సమయంలో స్ర్కీన్‌ వంక చూడకూడదు. స్నేహితులతో ఆడియో కాల్‌ మాట్లాడి, స్ర్కీన్‌ టైమ్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. 

నోటిఫికేషన్ల్‌ ఆఫ్‌: ఆఫీసు పని మొదలవగానే ఫోన్‌లో నోటిఫికేషన్స్‌ను ఆఫ్‌ చేసి ఉంచాలి. దాంతో పదే పదే ఫోన్‌ వంక చూడాల్సిన అవసరం ఉండదు. అలానే నోటిఫికేషన్స్‌ చూసేందుకు కొంత సమయం కేటాయించాలి. ఫోన్‌ ముట్టుకోకుండా చేయగలిగే పనులపై దృష్టి సారించాలి. అంతేకాదు ఆ రోజు ఆఫీసు పని అవగానే వర్క్‌కు సంబంధించి వచ్చే మెయిల్స్‌ను మరుసటి రోజు చూసుకున్నా సరిపోతుంది.

బ్రేక్స్‌ తప్పనిసరి: విశ్రాంతి కోసమని యూట్యూబ్‌లో వీడియోలు లేదా గేమ్‌ సైట్స్‌ను చూడడం కూడా స్ర్కీన్‌ టైమ్‌న పెంచుతుంది. అందుచేత బ్రేక్‌ టైమ్‌లో కిటికీ పక్కన నిల్చొని తనివితీరా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగాలి. లేదంటే కొద్దిసేపు నడవాలి. ప్రతి గంటకు అయిదు నిమిషాల చొప్పున బ్రేక్‌ తీసుకోవడం మరిచిపోవద్దు. బ్రేక్‌ సమయంలో ఫోన్‌  చూడడం కూడా తగ్గించాలి.

ఒకేసారి ఒకే స్ర్కీన్‌: ఒకే విధమైన స్ర్కీన్‌ చూస్తూ పనిచేయడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. వివిధ రకాల స్ర్కీన్‌లను చూస్తూ పనిచేసే వారిలో మెదడు బాగా చురుకుగా ఉంటుందని, మానసికి అలసట కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబటి మీకు అవసరమైన సమాచారాన్ని ఒకే స్ర్కీన్‌ మీద కనిపించేలా చేసుకుంటే ఆన్‌లైన్‌ అంతరాయాలను తగ్గించవచ్చు.

Updated Date - 2021-02-03T05:30:00+05:30 IST