తగ్గిన మొక్కజొన్న దిగుబడి

ABN , First Publish Date - 2021-10-19T05:22:29+05:30 IST

ఖరీఫ్‌ మొక్కజొన్నపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న రైతులకు నిరాశే ఎదురైంది.

తగ్గిన మొక్కజొన్న దిగుబడి

  1. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే
  2. రూ.2 వేల నుంచి రూ.1,600కు పడిపోయిన ధర
  3. ఆందోళనలో రైతులు 


రుద్రవరం, అక్టోబరు 18: ఖరీఫ్‌ మొక్కజొన్నపై  ఎన్నో ఆశలు పెట్టుకొన్న రైతులకు నిరాశే ఎదురైంది. దిగుబడి బాగా తగ్గిపోయిందని ఆవేదన చెందుతున్నారు. రుద్రవరం మండలంలో మొక్కజొన్న పంటను 6,500 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టారు. అయితే  ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. క్వింటం రూ.2 వేలు ఉన్న ధర రూ.1,600లకు పడిపోయింది. దిగుబడి తగ్గిపోయి, గిట్టు బాటు ధర లేక పూర్తిగా నష్టపోయామని   రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట కోత యంత్రానికి గంటకు రూ.2,600 బాడుగ చెల్లించాల్సి వస్తోందని, గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని  రైతులు వాపోతున్నారు. 


గిట్టుబాటు ధర ఏదీ?

మొక్కజొన్న ఎంతో ఆశతో సాగు చేశా.  గిట్టుబాటు ధర చూస్తే అం తంత మాత్రమే ఉంది. బాగా నష్టపోయాం. 

- మహమ్మద్‌, రైతు, ఆలమూరు 


దిగుబడి తగ్గింది

మొక్కజొన్నపంట దిగుబడి తగ్గింది. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్లకు దిగుబడిపోయింది. కనీసం పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు.   

 - చిన్నదస్తగిరి, రైతు, కొండమాయపల్లె  


తీవ్ర నష్టం

మొక్కజొన్న పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయా.  ఎక రాకు రూ.25 వేలు  పెట్టుబడి పెట్టా.  దిగుబడి, ధరలు సరిగా లేవు. 

- జమాల్‌బాషా, రైతు, కొండమాయపల్లె 



Updated Date - 2021-10-19T05:22:29+05:30 IST