ఓపెన్‌ స్కూల్స్‌లోనూ తగ్గిన ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-06-25T19:34:38+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నిర్వహించిన టెన్త్‌, ఇంటర్‌ (దూర విద్య) ఫలితాలను సొసైటీ రాష్ట్ర డైరెక్టర్‌ కె.వి. శ్రీనివాసులురెడ్డి శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన

ఓపెన్‌ స్కూల్స్‌లోనూ తగ్గిన ఉత్తీర్ణత

టెన్త్‌లో 52.64, ఇంటర్‌లో 60.40%

ఆగస్టు 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు


అమరావతి, గుంటూరు(విద్య),  జూన్‌ 24: ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌  సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నిర్వహించిన టెన్త్‌, ఇంటర్‌ (దూర విద్య) ఫలితాలను సొసైటీ  రాష్ట్ర డైరెక్టర్‌ కె.వి. శ్రీనివాసులురెడ్డి శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెన్త్‌  పరీక్షలకు 32,040 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 16,866 మంది (52.64శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇంటర్‌ పరీక్షలకు 49,238 మంది హాజరుకాగా వారిలో 29,742 మంది(60.40శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను www.apopenschool.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో  ఉంచినట్లు ఆయన వెల్లడించారు.  ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక మంది ఉత్తీర్ణులయ్యారు. పదిలో బాలుర ఉత్తీర్ణతశాతం 49.25శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 55.43శాతంగా ఉంది. అదేవిధంగా ఇంటర్‌లో బాలుర ఉత్తీర్ణత 57.81శాతం ఉండగా, బాలికల ఉత్తీర్ణత 63.19శాతం ఉంది. పది, ఇంటర్‌ విద్యార్థులు ఈనెల 27 నుంచి వచ్చే నెల 7 వరకూ రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 3 నుంచి 11వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అభ్యర్థులకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 20 వరకు నిర్వహిస్తారు. పరీక్ష ఫీజును ఈ నెల 27 నుంచి జూలై 7లోగా చెల్లించాలి.

Updated Date - 2022-06-25T19:34:38+05:30 IST