తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం

ABN , First Publish Date - 2022-06-27T05:13:50+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో రిజిస్ర్టేషన్ల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం ఆమాంతం పెరగడం ప్ర భుత్వానికి కలిసొచ్చింది.

తగ్గిన రిజిస్ట్రేషన్లు.. పెరిగిన ఆదాయం
గద్వాల రిజిస్ర్టేషన్‌ కార్యాలయం

  - చార్జీల పెంపుతో కలిసొచ్చిన రాబడి 

- మూడు నెలల్లోనే రూ.ఆరు కోట్ల ఆదాయం

 గద్వాల అర్బన్‌, జూన్‌ 26  : జోగుళాంబ గద్వాల జిల్లాలో రిజిస్ర్టేషన్ల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం ఆమాంతం పెరగడం ప్ర భుత్వానికి కలిసొచ్చింది.  సాగు భూముల మార్కెట్‌ విలువను 50శాతం మేర కు పెంచడంతో పాటు ఇ తర స్థలాల మార్కెట్‌ విలువను సైతం ఆయా ప్రాంతాల వారీగా పెంచుతూ ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కని పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లోనే(జూన్‌ 21నాటికి) రూ.6.46 కోట్ల  ఆదాయం రావడంతో  ఉమ్మడి జిల్లాలోనే రికార్డుగా చెప్పవచ్చు. 

ఏడునెలల్లో రెండు సార్లు..

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చార్జీలను ఏడునెలల్లోనే రెండుసార్లు పెంచుతూ తీ సుకున్న నిర్ణయం రిజిస్ర్టేషన్ల ఆదాయాన్ని రెట్టింపు చేసింది.  దాదాపు రాష్ట్రం ఏర్పా టు అనంతరం తొలిసారిగా జూలై 22, 2021న ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న భూ ముల మార్కెట్‌ విలువను 50శాతానికి పెంచింది. ఇందులో వ్యవసాయ భూముల వి లువలను రెట్టింపు చేయగా, అర్బన్‌ ప్రాంతాల్లో వ్యవసాయేతర స్థలాల విలువను 30 శాతానికి పెంచింది. తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 1నుంచి అన్నిరకాల చార్జీలను 50శా తం పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో రిజిస్ర్టేషన్ల సంఖ్య తగ్గినా ఆదాయంలో మా త్రం తేడా కనిపించకపోవడం గమనార్హం.  

రూ. 6.46కోట్ల ఆదాయం

 గద్వాల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 2020-21లో మొత్తం 15,567 దస్తావేజు లను రిజిస్ట్రర్‌ చేయగా, వాటిద్వారా రూ.13.67కోట్ల ఆదాయం లభించింది.  2021-22 లో  మొత్తం 15,446 దస్తావేజలు (21 తగ్గాయి) రిజిస్ర్టేషన్‌ చేయగా, ఆదాయం రూ. 24.37 కోట్లకు పెరగడం గమనార్హం.  అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో మొదటి మూడు నెలలలోపు(జూన్‌ 21నాటికి) 3,361 దస్తావేజులు రిజిస్ట్రర్‌ కాగా, వాటి ద్వారా రూ.6.46కోట్ల ఆదాయం లభించడం విశేషం.  

 కోర్టు ఆదేశాలు పాటిస్తున్నాం

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డీటీసీపీ అనుమతి లేని కొత్త వెంచర్ల ప్లాట్లను రిజిస్ట్రర్‌ చేయడం లేదు.  డీటీసీపీ అనుమతి లేకున్నా, పాత వెంచర్లలో కొ నుగోలు చేసిన వారు వాటిని తిరిగి అమ్మేందుకు మాత్రం రిజిస్ర్టేషన్లను చేపడు తున్నాం. దీంతో వ్యవసాయేతర స్థలాల రిజిస్ర్టేషన్ల ద్వారా వచ్చే ఆదాయానికి ఎలాం టి ఆటంకాలు ఎదురుకావడం లేదు. 

 - చంద్రశేఖర్‌ రెడ్డి, సబ్‌ రిజిస్ర్టార్‌, గద్వాల 

Updated Date - 2022-06-27T05:13:50+05:30 IST