సంపన్న యువ పారిశ్రామికవేత్తల్లో దివ్యాంక్‌ టాప్

ABN , First Publish Date - 2021-10-16T01:29:30+05:30 IST

మీడియా. నెట్‌ వ్యవస్థాపకుడు దివ్యాంక్‌ తురాఖియా రూ. 12,500 కోట్ల నెట్‌వర్త్‌తో 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

సంపన్న యువ పారిశ్రామికవేత్తల్లో దివ్యాంక్‌ టాప్

హైదరాబాద్ : మీడియా. నెట్‌ వ్యవస్థాపకుడు దివ్యాంక్‌ తురాఖియా రూ. 12,500 కోట్ల నెట్‌వర్త్‌తో 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్-హురున్ ఇండియా 40, అండర్ సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2021’ లో 45 మంది స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు ఉండగా...  ఒక్కొక్కరికి రూ. వెయ్యి కోట్లకు పైగా నెట్‌వర్త్ ఉంది. వీరిలో  దివ్యాంక్ అగ్రస్థానంలో ఉన్నారు. బ్రౌజర్‌ స్టాక్‌ వ్యవస్థాపకుడు నకుల్‌ అగర్వాల్‌(38), రితేశ్‌ అరోరా(37) (రూ.12,400 కోట్ల చొప్పున సంపద) రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. రూ.  12,200 కోట్ల నెట్‌వర్త్‌తో, పాలో ఆల్టో ఆధారిత నేహా నార్ఖేడ్ కుటుంబ సభ్యులు జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు


అంతేకాకుండా ఆయన ఈ జాబితాలోకి కొత్తగా ప్రవేశించారు. కాగా... 45 మందిజాబితాలోని వారి మొత్తం సంపద ఈ ఏడాది రూ. 1,65,600 కోట్ల మేర పెరిగింది. గత ఏడాదిలో నమోదైన మొత్తం సంపదతో పోల్చితే 286 శాతం వృద్ధి నమోదైంది. కొత్తగా 31 మందికి చోటు దక్కగా, అందులో 30 మంది స్టార్టప్‌ల వ్యవస్థాపకులే కావడం విశేషం. నగరాలవారీగా చూస్తే, బెంగళూరు నుంచి అత్యధికంగా 15 మందికి స్థానం లభించగా..  ఎనిమిది మంది ఢిల్లీకి చెందిన వారు, అయిదుగురు ముంబైకి చెందినవారు.  ముగ్గురు మాత్రం విదేశాల్లో నివసిస్తున్నారు. జాబితాలోని యువ పారిశ్రామికవేత్తల సరాసరి వయసు 34 ఏళ్లు కాగా... భారత్‌పే సహ వ్యవస్థాపకుడు శాశ్వత్‌ నక్రానీ (23 ఏళ్లు) అత్యంత పిన్న వయస్కుడు. గతనెల 15 నాటికి  కనీసం రూ. వెయ్యి కోట్ల ఆస్తి కలిగిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించినట్లు ఐఐఎఫ్ఎల్‌-హురున్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ఓలా యొక్క భవిష్ అగర్వాల్ సెప్టెంబరు 15 వరకు తన సంపదను రెట్టింపు చేసి రూ. 7,500 కోట్లకు పైగా గడించారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ అగర్వాల్ కంటే ఎక్కువ ర్యాంకులు కలిగి ఉన్న జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు.

Updated Date - 2021-10-16T01:29:30+05:30 IST