కావలిలో TDP, మున్సిపల్ అధికారుల మధ్య ముదురుతున్న వివాదాలు

ABN , First Publish Date - 2022-07-06T18:36:27+05:30 IST

కావలిలో టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారుల మధ్య వివాదాలు ముదురుతన్నాయి.

కావలిలో TDP, మున్సిపల్ అధికారుల మధ్య ముదురుతున్న వివాదాలు

నెల్లూరు: కావలిలో టీడీపీ నేతలు(TDP leaders), మున్సిపల్ అధికారుల మధ్య వివాదాలు ముదురుతన్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నాడని టీడీపీ నేత అమీర్ ఖాన్ (Ameer khan) ఇంటి ముందు గోడని మున్సిపల్ అధికారులు తొలగించారు. అమీర్ ఖాన్ కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. మైనర్ ముస్లిం బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాబూరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన 13 మంది‌ టీడీపీ నేతలు, మరికొందరిపై మున్సిపల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సీనియర్ ముస్లిం నేత, మాజీ కౌన్సిలర్ ఇనాయత్ హుస్సేన్‌ (Inayat Hussain)ని నోర్మూయ్.. గెటౌట్ అంటూ కమిషనర్ శివారెడ్డి (Shiva reddy) ఘోరంగా అవమానించారు. దీంతో శివారెడ్డిపై ఇనాయత్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ వికలాంగులు నిరసనకు దిగారు. 

Updated Date - 2022-07-06T18:36:27+05:30 IST