ltrScrptTheme3

దీపావళి.. అక్రమాల కేళి!

Oct 24 2021 @ 23:42PM

వ్యాపారుల ఇష్టారాజ్యం

ఇష్టానుసారంగా అమ్మకాలు

గాలిలో నిబంధనలు

కొరవడిన నిఘా


దీపావళి వచ్చేస్తోంది.. బాణసంచా షాపులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.. వ్యాపారం అంతా నిబంధనల మేరకు సాగుతుందా అంటే కాస్త ఆలోచించాల్సిందే.. ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యాపారం చేస్తున్నారు..ఒకే లైసెన్స్‌పై వ్యాపారాలు చేసే వారు కొందరైతే.. చైనా బాణసంచా విక్రయించేవారు మరికొందరు. కంపెనీ బాణసంచా మాటున బోగస్‌ కంపెనీల బాణ సంచా విక్రయించే వాళ్లు ఇంకొందరు.. అయినా పట్టించుకునే నాథులే కాన రావడంలేదు. దీంతో ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేస్తున్నారు.


– పాలకొల్లు అర్బన్‌


దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో బాణసంచా వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి అక్రమార్జనలకు పాల్పడుతున్నారు. అనుమతించిన లైసెన్స్‌ కన్నా అధిక నిల్వలు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు వారి సామర్థ్యానికి మించి అధికంగా బాణసంచా నిల్వలను గొడౌన్లు, ఇతర ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. అధికారికంగా లెక్కల్లో చూపించకుండా అక్రమాలకు పాల్పడుతు న్నారు. అంతే కాకుండా పాలకొల్లు పట్టణంలో ఒకే పేరుతో రెండేసి లైసెన్స్‌లు పొంది వ్యాపారాలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చైనా బాణసంచా విక్రయించకూడదన్న నిబంధన ఉన్నా కనీసం పట్టించుకోవడం లేదు.లాభార్జనకు చైనా బాణసంచా అమ్మకా లకు తెగబడుతున్నారు. కంపెనీ బాణసంచా మాటున బోగస్‌ బాణసంచా విక్రయిస్తు న్నారు. గతేడాది మిగిలిపోయిన బాణసంచాను కలిపేసి అమ్మకాలు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యాపారం వ్యవహ రిస్తున్నారు. (చైనా బాణసంచాపై 690, 695 అంకెల ద్వారా ఉన్న బార్‌ కోడ్‌ను గుర్తిం చవచ్చు. భారతదేశ బాణసంచాపై 890 బార్‌ కోడ్‌ ఉంటుంది. అధికారుల నిఘా లేక పోవడంతో వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇష్టానుసారం జరిగిపోతోం ది.ఇకనైనా అధికా రుల బాణసంచా వ్యాపారులపై నిఘా పెట్టాల్సి ఉంది. 


నిబంధనలు పాటించాలి : జానకిరామ్‌, ఫైర్‌ ఆఫీసర్‌, పాలకొల్లు


బాణసంచా వ్యాపారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఎక్కడైనా నిబంధనలు మీరితే చర్యలు చేపడతాం. పాలకొల్లు ఫైర్‌ స్టేషన్‌ పరిధిలో గతే డాది 47 మంది బాణసంచా విక్రయదారులకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేశాం. ఈ ఏడాది ఇంకా లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. మా పరిధిలో పర్మి నెంట్‌గా లైసెన్సు పొందిన షాపులు ఆరు ఉన్నాయి. బ్రాడీపేట, నరసాపురం బైపాస్‌ రోడ్డుల్లో బాణసంచా షాపులకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.