ఇయ్యాలె అచ్చమైన దీపావళి

ABN , First Publish Date - 2021-11-04T05:45:56+05:30 IST

ఇయ్యాలె అచ్చమైన దీపావళి

ఇయ్యాలె అచ్చమైన దీపావళి
స్వరాజ్యమైదానంలో టపాసుల కోసం వినియోగదారుల రద్దీ

జోరందుకున్న బాణసంచా విక్రయాలు

చిమ్మ చీకట్లో దీపాల పూలు పూసే పండుగ దీపావళి. జీవితాన్ని ఆనందమయం చేసుకునే జనావళికి ఇది ఆనంద కేళి. బతుకు అనే ప్రమిదలో రేపటి ఆశను వత్తిగా ఉంచి.. సంకల్పాన్ని చమురుగా పోసి వెలిగిస్తే.. అంధకారం పటాపంచలవుతుందని చెప్పే వెలుగుల వేడుక ఇది. అమావాస్య రోజు అంగరంగ వైభవంగా చేసుకునే ఈ పండుగకు జిల్లా ముస్తాబైంది.  

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) జిల్లావ్యాప్తంగా బాణసంచా కొనుగోళ్లు భారీగా జరిగాయి. మూడు రోజులుగా వర్షం దోబూచులాడుతుంటే అమ్మకాలు ఎలా ఉంటాయా అని వ్యాపారులు ఆందోళన చెందారు. కానీ, రూరల్‌ ప్రాంతాల్లోని గోడౌన్ల నుంచి సరుకు భారీగా వస్తుండగా, విక్రయాలు జోరందుకున్నాయి. స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా స్టాళ్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. గురువారం కూడా భారీగా జరిగే అవకాశం ఉంది. గన్నవరం, నూజివీడు, పల్లెర్లమూడి, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో బాణసంచా విక్రయిస్తున్నారు. 70-80 శాతం డిస్కౌంట్లు ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. స్వరాజ్యమైదానంలో అయితే 70 శాతం మేర డిస్కౌంట్‌ ఇస్తూ రిటైల్‌గా విక్రయిస్తున్నారు. 





Updated Date - 2021-11-04T05:45:56+05:30 IST