కరోనా వల్ల మెదడు పని చేయలేదు.. అందుకే.. : దీపికా పదుకొనే

Published: Sat, 08 Jan 2022 10:10:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కరోనా వల్ల మెదడు పని చేయలేదు.. అందుకే.. : దీపికా పదుకొనే

గత రెండేళ్లుగా కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అప్పటినుంచి ఎంతోమంది కోవిడ్ కారణంగా ఇబ్బంది పడ్డారు. సాధారణ ప్రజలే కాకుండా సినీ ప్రముఖులు సైతం దానితో ఈ వ్యాధిని ఎదుర్కొన్నారు. గతేడాది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ తార.


దీపికాకి కరోనా వచ్చిన కొన్ని వారాల్లోనే తగ్గిపోయింది. అనంతరం కూడా రెండు నెలలు గ్యాప్ తీసుకుని షూటింగ్స్‌కి వెళ్లింది ఈ తార. దీని గురించి ఈ భామ మాట్లాడుతూ.. ‘కోవిడ్ తర్వాత జీవితం చాలా మారిపోయింది. ఎందుకంటే శారీరకంగా, నన్ను నేనే గుర్తించలేనంతగా మారిపోయాను. నాకు ఇచ్చిన మందులు, నేను వేసుకున్న స్టెరాయిడ్స్ కారణంగా అలా అయింది అనుకుంటా. కాబట్టి కోవిడ్ విచిత్రంగా, మీ శరీరానికి, మనస్సుకి భిన్నంగా ఎన్నో మార్పులను కారణం అవుతుంద’ని చెప్పుకొచ్చింది. 


ఇంకా మాట్లాడుతూ ‘నాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకా బాగానే ఉందని నేను భావించాను. కానీ ఆ తర్వాత, నా మెదడు పని చేయకపోవడంతో నేను రెండు నెలలు పనికి సెలవు పెట్టవలసి వచ్చింది. నాకు ఆ సమయంలో చాలా కష్టంగా అనిపించింద‌’ని తెలిపింది.


అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం శకున్ బత్రా దర్శకత్వంలో ‘గెహరియాన్’, అమితాబ్‌తో కలిసి ‘ది ఇంటర్న్’, షారుక్ ఖాన్‌తో కలిసి ‘పఠాన్’, హృతిక్ రోషన్ హీరోగా ‘ ఫైటర్’ సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...