
కొత్త సంవత్సరంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ ఏడాది దాదాపు అయిదు సినిమాల్లో నటిస్తుండగా.. అందులో డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కతున్న చిత్రం ‘గెహ్రయాన్’.
దీపికా బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని క్యారెక్టర్స్ ప్రవర్తన విధానం ఏంటో తెలిసేలా పోస్టర్స్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది దీపికా. వాటిలో ఈ సినిమాలోని నాలుగు పాత్రల మధ్య జరిగే సంభాషణని పొందుపరిచారు. అవి ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి.
నలుగురి మధ్య సాగే విచిత్రమైన బంధాల నేపథ్యంలో సాగే ఓ డిఫరెండ్ కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న ఈ సినిమాని వయాకామ్ 18, ధర్మా ప్రోడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శాకున్ బత్రా దర్శకత్వం వహిస్తున్నాడు.