
బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో ఒకరు దీపికా పదుకోనే ఒకరు. 2006లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘ఓం శాంతి ఓం’ మూవీతో హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఈ తార.. అనంతరం వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
అయితే దీపికా జనవరి 5న తన 35వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన 14 సంవత్సరాల సినీ కెరీర్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది ఈ తార. అందులో చివరి నుంచి ఇప్పటి వరకూ ఎలా సాగింది. నిజమైన సక్సెస్ అంటే ఏంటని వివరించింది ఈ భామ.
దానికి.. ‘మీకు ఇష్టమైన పనిని చేసినప్పుడు, మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకోగలుగుతారు. అందుకే మీరు జీవించాల్సిన జీవితం మీరు అనుకున్నదే కావాలి. కాబట్టి భయపడకుండా మనసును అనుసరించండి. మీకు తెలియని చోట, మీకు ఉపయోగపడేలా తలుపులు తెరుచుకుంటాయ’ని క్యాప్షన్ రాసుకొచ్చింది దీపికా.
అంతేకాకుండా దీపికా షేర్ చేసిన ఈ వీడియోలో అవార్డులు అందుకున్న సందర్భాలు, ఆమె సినిమాలు ‘రామ్లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘తమషా’ సినిమాలకి సంబంధించి మేకింగ్ సీన్స్ ఉన్నాయి. అందులో.. ‘ఒక వ్యక్తిగా నేను ఎవరో మర్చిపోయాను. నటిగా నేను వేరు, వ్యక్తిగా నేను వేరు. నేను చాలా మారాను. ఇంకా మంచిగా మారతానని ఆశిస్తున్నాన’ని ఈ భామ చెప్పుకొచ్చింది.