
దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమాకు టైటిల్‌ను ప్రకటించారు. ఆ చిత్రానికి ‘‘ గెహ్రాహియా ’’ అని పేరు పెట్టారు. గత కొంతకాలంగా టైటిల్ పెట్టకుండానే సినిమా చిత్రీకరణ జరిపారు. గెహ్రాహియా సినిమాకు శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, వయాకాం 18 స్టూడియోలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఈ సినిమా టైటిల్‌ను డిసెంబర్ 20న అధికారికంగా ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేశారు. ఆ చిత్రంలో దీపికా పదుకొణె తన అందాలతో కుర్రకారు మతిని పొగోట్టింది. ఆమె బోల్డ్‌గా బికినీ అవతారంలో దర్శనమిచ్చింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. థియేటర్లు అందుబాటులో ఉన్నప్పటికి ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నారు. జనవరి 25నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. సినిమా హాళ్లల్లో చిత్రాన్ని విడుదల చేయాలంటే సెన్సార్ సర్టిఫికేట్ కావాలి. సెన్సార్ బోర్డు ఈ చిత్రంలోని అనేక సీన్లకు కత్తెర వేసే అవకాశం ఉంది. అందువల్ల ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు.