
పోటీ అనేది ఏ రంగంలోనైనా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయితే ఈ పోటీ మరి అధికంగా ఉంటుంది. ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. దర్శకుడేమో ఒకరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఎవరు ఎంపికవుతారు.. ఆ పాత్రను ఎవరూ పోషిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇంతకీ ఆ సినిమా ఏంటీ..? పోటీ పడే ఇద్దరూ హీరోయిన్లు ఎవరనే కదా మీ సందేహం.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఈ స్టోరీని చదివేయాల్సిందే.
రామ్ లీలా, పద్మావత్, బాజీ రావ్ మస్తానీ వంటి భారీ తరహా సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ మూడు చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం గంగూబాయి కథియావాడి. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్ పాత్రను పోషించింది. మరికొన్ని రోజుల్లో ఆయన కొత్త సినిమాను ప్రకటించబోతున్నారు. ఆ ప్రాజెక్టు పేరు బైజు బావ్రా. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ హీరోగా చేయబోతున్నాడు. హీరోయిన్గా ఆలియా భట్ వైపు సంజయ్ లీలా భన్సాలీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. గంగూబాయి కథియావాడి చిత్రంలో ఆమె నటనకు దర్శకుడు ఫిదా అయ్యారు. దీపికా పదుకొణె కూడా బైజు బావ్రాలో హీరోయిన్ పాత్రను చేయాలని అనుకుంటుంది.
‘‘ బైజు బావ్రాలో హీరోయిన్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయలేదు. ఆలియా భట్ మాత్రం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. ఆమెకు కథ ఎంతగానో నచ్చింది. ఎటువంటి పారితోషికం తీసుకోకుండా ఆమె సినిమాను చేస్తానని చెప్పింది. దీపికా కూడా హీరోయిన్ పాత్రను చేయాలని అనుకుంటుంది. ప్రస్తుతానికి భన్సాలీ మాత్రం ఆలియాను ఎంపిక చేయాలని చూస్తున్నారు ’’ అని బైజు బావ్రా సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తి చెబుతున్నారు.