ఉప్పెనలా రాజధాని ఉద్యమ హోరు.. ఏకైక రాజధాని కోసం ఏడాదిగా..

ABN , First Publish Date - 2020-12-17T06:07:38+05:30 IST

రాజధాని రైతుల ఉద్యమ జ్వాల సంవత్సర కాలంగా..

ఉప్పెనలా రాజధాని ఉద్యమ హోరు.. ఏకైక రాజధాని కోసం ఏడాదిగా..
తుళ్లూరులో రైతుల నిరసన ప్రదర్శన

అమరావతి.. అకుంఠిత దీక్ష

ఏకైక రాజధాని పోరుబాటకు ఏడాది పూర్తి

మహిళలే ముందుండి నడిపిస్తోన్న పోరాటం

లాఠీ దెబ్బలకు వెరవకుండా లక్ష్యసాధన దిశగా అడుగులు 


(గుంటూరు, ఆంధ్రజ్యోతి): లాఠీ దెబ్బలకు వెరవకుండా.. అక్రమ కేసులకు బెదరకుండా.. జైళ్లలో పెట్టినా జంకకుండా.. వ్యతిరేకుల దాడులతో వెనకంజ వేయకుండా.. పోలీసుల దెబ్బలకు పారిపోకుండా.. అధికార పార్టీ నేతల చీదరింపులకు చితికిపోకుండా.. గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ.. శాంతియుత మంత్రాన్ని జపిస్తూ.. పండుగేదైనా.. సందర్భం ఏదైనా.. అమరావతి కోసం అలుపెరగకుండా అకుంఠిత దీక్షతో చేపట్టిన రాజధాని ఉద్యమానికి ఏడాదైంది. ఏకైక రాజధాని అమరావతి నినాదంతో  365 రోజులుగా అలసిపోకుండా లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించేది లేదంటూ.. వాడవాడలా మద్దతును సమీకరించు కుంటూ పోరు కొనసాగిస్తోన్నారు. సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ తొలుత అమరావతి పరిధిలోని మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రారంభమైన ఉద్యమం కొద్ది రోజుల్లోనే అన్ని ప్రాంతాలకు విస్తరించింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు ఊరు, వాడ అన్నట్లుగా మహిళల సారథ్యంలో ఉద్యమ బాట పట్టి కదం తొక్కుతూ ముందుకు సాగుతోన్నారు. 


రాజధాని రైతుల ఉద్యమ జ్వాల సంవత్సర కాలంగా ప్రజ్వరిల్లుతూనే ఉంది. వైసీపీ మినహా  అన్ని పార్టీల మద్దతు, ప్రజాసంఘాల దన్ను, మహిళా రైతుల పోరా ట పటిమ.. కలగలిసి సాగుతున్న ఈ సమరానికి బుధ వారంతో ఏడాది పూర్తిచేసుకుంది. రాజధానికి భూము లిచ్చిన రైతులు, రైతుకూలీలు, వివిధ వర్గాల ప్రతి నిధులతో ఏర్పాడిన అమరావతి పరిరక్షణ సమితి అ కుంఠిత దీక్షతో రాధాని కోసం పోరాడుతోంది. నిరా హార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, రహదారులపై బైఠా యింపు, అసెంబ్లీ ముట్టడి, మౌన ప్రదర్శనలు, ర్యాలీలు, ప్రార్థనలు, యాగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లకు విన్నపాలు, వేడుకోళ్లు... ఇలా పోరు నిత్యనూ తనంగా సాగుతూనే ఉంది. చీదరింపులు, లాఠీ చార్జీ లు, బెది రింపులు, దాడులను ఎదుర్కొంటూ రాజధాని రైతులు అమరావతి నుంచి ఢిల్లీ వరకు  తమ ఉద్యమ నినా దాన్ని వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు నిర్బందిస్తు న్నా.. లాఠీలు ఝళిపిస్తున్నా.. కేసులు పెట్టి చేతు లకు సంకెళ్లు వేసి జైళ్లకు పంపుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికీ వెరవ కుండా వివిధ రూపాల్లో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు న్యాయదేవతలకు మొక్కుల మొ క్కుతూ, న్యాయమూర్తులకు మొకరిళ్లుతూ పోరాటం చేస్తున్నారు.


జాతీయ రహదారి దిగ్బంధానికి ప్రయ త్నించినప్పుడు పోలీసుల లాఠీలు రైతులపై నృత్యాలు చేశాయి. జనవరిలో అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు మరో సారి లాఠీలకు పని చెప్పారు. ఇద్దరు ఎస్పీలు లాఠీ చేత పూని నేరుగా రంగంలోకి దిగ్గారు. వారికి మద్దతు ఇచ్చిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు తిప్పలు తప్పలేదు. ఇద్దరు యువకులు వెలగపూడి దీక్ష శిబిరంలో ఆమరణ దీక్షకు కూర్చోగా ఐదు రోజుల తర్వాత పోలీసులు బలవంతం గా భగ్నం చేశారు. రాయపూడికి చెందిన ఓ రైతు 100గంటల దీక్షకు కూర్చొగా ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. చివరకు ఇంటింకి అమరావతి కార్యక్రమంలో భాగంగా ఉద్దండరాయునిపాలెంలో ప్ర చారం చేసుకుంటున్న మహిళలపై పోటీ ఉద్యమ దారులు రాళ్ల వర్షం కురిపించారు. దీనిని నిరసిస్తూ తుళ్లూరు మహిళలు, రైతులు 20 గంటల పాటు రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు. రైతుల పోరుకు ఎన్నారైలు బాసటగా నిలిచారు. ఇలా అనేక అవరోధా లు, అవమానాలు తట్టుకొని అమరావతి పరిరక్షణ ఉద్యమం బుధవారంతో సంవత్సరం పూర్తి చేసుకుంది.


సీఎం ప్రకటనతో ఎగిసిన ఉద్యమం 

2019 డిసెంబరు 17న శాసనసభలో సీఎం జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో రాజధాని ప్రజలు, రైతుల్లో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాల లు వెల్లువెత్తాయి. ఆ మర్నాడే వెలగపూడిలో దీక్షా శిబిరం మొదలైంది. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతు లంతా అమరా వతే ఆశ, శ్వాస, అంతిమ లక్ష్యం గా పోరుబాట పట్టారు.  రైతు ఉద్యమం మొదల య్యాక రాజధాని గ్రామాల్లో ప్రభు త్వం వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని దించింది. 29 గ్రామాల్లో 144వ సెక్షన్‌, పోలీసు చట్టం 30ను ప్రయోగించి ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నించింది. వీటన్నింటిని మహిళలు, రైతులు శాంతి యుతంగానే ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇళ్లలోనే నిరనస కొనసాగించా రు. సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూ డు రాజధానుల బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలప డంతో ఆందోళనలు మిన్నంటాయి. 





మహిళలే ముందుండి..

అమరావతి పరిరక్షణ ఉద్యమంలో మహిళలదే సిం హభాగం. దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునే కార్య క్ర మైనా, అసెంబ్లీ ముట్టడైనా, జాతీయ రహదారి దిగ్బంధమైనా,  జైలు భరో అయినా.. అతివలే ముం దుండి నడిచారు.. నడిపించారు. పోలీ సుల బూటు కాళ్లతో తన్ని నా, లాఠీలతో కొట్టినా మౌనంగా భరిం చారు. అరెస్టు చేసి స్టేషన్లు తప్పినా ఆత్మస్థైర్యం కోల్పో లేదు. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుని, తమ గోడు బెళ్లబోసుకు నేందుకు రాజధాని గ్రామాల నుంచి పొంగళ్లతో బయల్దేరిన మహిళలపై  అమానుషంగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. మందడం దీక్షా శిబిరం లో పోలీసులు ప్రవేశించి మహిళలను బూట్‌ కాళ్లతో కొ ట్టారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్ర గాయా లు పాలయ్యారు. ఈ ఘటనలపై హైకోర్టు ఆగ్ర హం వ్యక్తం చేసింది. జాతీయస్థాయిలో చర్చనీయాంశం అ వటంతో జాతీయ మహిళా కమిషన్‌ నియమించిన ప్రత్యేక కమిటీ రాజ ధాని గ్రామాల్లో పర్యటించి విచారణ జరిపింది.


స్వాతంత్ర్యోద్యమం తర్వాత ఇదే పెద్ద ఉద్యమం

‘‘102 ఏళ్ల నా జీవితంలో క్విట్‌ ఇండియా స్వాతం త్ర్యోద్యమాన్ని చూశాను. అప్పటికి నాకు రాజకీయా లు తెలియవు. రాజకీయ జీవితం మొదలయ్యాక ఇంత సుదీర్ఘంగా రాజధాని కోసం సాగుతున్న రైతు ఉద్య మాన్ని తొలిసారి చూస్తున్నాను. పెద్ద మనసుతో ముందుకు వచ్చి రాజధాని కోసమని రూ.కోట్ల విలువైన భూములను ఉచి తంగా ఇచ్చి, అదే రాజధాని కోసం సంవత్సరకాలం పా టు రైతులు పోరాడు తున్నా రు. వారిని ఈ స్థితికి ప్రభు త్వం తీసుకురావడం బాధి స్తోంది. రైతులు పడుతున్న ఇబ్బందులు, రాజధాని ద యనీయస్థితి, రాష్ట్ర ప్రజల అవస్థలు చూసి ఈ సారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్‌ అంధకారమవుతుందనేది జగన్‌ సర్కార్‌ గుర్తెరిగితే మంచిది.’’  

- యడ్లపాటి వెంకట్రావు,  సీనియర్‌ రాజకీయవేత్త 


హైకోర్టు తరలింపు...కుదరదు..


గుంటూరు(లీగల్‌): రాష్ట్ర హైకోర్టును నేలపాడు నుంచి కర్నూ లుకు తరలించడం కండువాలు మార్చినంత తేలిక కాదని పలు వురు న్యాయవాదులు తేల్చి చెప్పారు. దశాబ్దాల తరబడి హైకోర్టు బెంచ్‌ కోసం పోరాడితే రాష్ట్ర విభజనతో ఏకంగా హైకోర్టే ఏర్పాటు జరిగిందని దానిని తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదని అంటున్నారు. మూడు రాజధానుల్లో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించరాదని న్యాయవాదులు ఉద్యమం ప్రారం భిం చి ఏడాది కావస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు బెంచ్‌ కోసం నిర వధిక నిరాహార దీక్షలు చేపట్టి ప్రాణత్యాగాలకు సిద్ధపడిన తాము రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా సొంత అజెండాతో హైకో ర్టును తరలిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని న్యాయవాదులు అం టున్నారు. 


జీవితాలు తలకిందులు...

మూడు రాజధానులతో అమరావతిని నమ్ముకున్న ఎన్నో జీవితాలు తలకిందులయ్యాయి. మరెన్నో కుటుంబాలు ఆర్థికంగా కూలిపోయాయి. వివిధ నిర్మాణాలతో అమరావతి నిత్యం కోలాహలంగా ఉండేది. భూముల కొనుగోళ్లు.. విక్ర యాలతో సందడిగా ఉండేది. ప్రభుత్వం మారడంతో ఎక్కడి కక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. సందడి సద్దుమణిగింది. చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే వారి నుంచి పెద్దసంస్థల వరకు మూతపడ్డాయి. దీంతో ఎందరి బతుకులో రోడ్ల పాల య్యాయి.  

Updated Date - 2020-12-17T06:07:38+05:30 IST