ప్రజాధనం వృథా

ABN , First Publish Date - 2020-09-23T07:01:31+05:30 IST

నగరంలో చేస్తున్న అభివృద్ధి పనులు నాసిరకంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ప్రణాళిక లేకుండా పనులు చేయటంతో

ప్రజాధనం వృథా

సీఎం హామీ నిధుల పనులు మమ

నాసిరకంగా డివైడర్ల నిర్మాణం 

రోడ్లు విస్తరించకుండానే పనులు

కానరాని అధికారుల పర్యవేక్షణ 


ఖమ్మం కార్పొరేషన్‌, సెప్టెంబరు22: నగరంలో చేస్తున్న అభివృద్ధి పనులు నాసిరకంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ప్రణాళిక లేకుండా పనులు చేయటంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది.  అధికారులు పర్యవేక్షణ లేకపోవటంతో కాంట్రాక్టర్‌ ఇష్టారీతిగా పనులు చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. నగరంలోని డీఆర్‌డీఏ రహదారిలో జరుగుతున్న డివైడర్ల నిర్మాణాన్ని చూస్తే ఈ సంగతి అవగతమవుతోంది.  నగరంలోని మయూరి సెంటర్‌ నుంచి డీఆర్‌డీఏ కార్యాలయం వరకు రహదారి విస్తరణ, డివైడర్లు, సెంట్రల్‌ టైటింగ్‌ పనులు చేస్తున్నారు. సీఎం హామీ నిధుల నుంచి రూ.80లక్షలు కేటాయించారు. బస్‌ డిపో దాటిన తరువాత ప్రస్తుతం డివైడర్ల నిర్మాణం జరుగుతోంది. అసలే రద్దీగా, ఇరుకుగా ఉండే ఈ రహదారిని వస్తరించకుండానే డివైడర్ల నిర్మాణం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అవి కూడా నాసిరకంగా ఉంటున్నాయి.నగరపాలక సంస్థ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షించవలసి ఉండగా, వారు కనీసం తిరిగి చూడటం లేదు. గతంలో త్రీ టౌన్‌లో ఇలాగే రహదారి విస్తరించకుండా డివైడర్లు నిర్మించటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.


ఇవేం డివైడర్లు..

డీఆర్‌డీఏ రహదారిలో నిర్మిస్తున్న డివైడర్లను చూస్తుంటే ఇవేం డివైడర్లు అనిపించక మానదు. రహదారిని విస్తరిం చకుండానే, ప్రణాళిక లేకుండా ఇష్టారీతిగా నిర్మిస్తున్నారు. నాసిరకంగా నిర్మిస్తున్న ఈ పనులను అధికారులు పర్యవేక్షించటం లేదు. ఈ డివైడర్లు ఎంతకాలం ఉంటాయో అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారికి ఇరువైపులా వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న డివై డర్లతో రహదారి మరింత ఇరుకుగా మారింది.కాగా మయూరి సెంటర్‌లో ఆర్‌్క్షబీ గెస్ట్‌హౌజ్‌ దగ్గర రహదారికి నామ మాత్రపు మరమ్మతులు చేసి, రహదారి విస్తరణగా చూపిం చటం గమనార్హం. నగరంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పుకుం టున్నా.. ఇటు వంటి నాసిరకం నిర్మాణాలతో ప్రజాధనం వృఽథానే కాకుం డా, ప్రజలకు ఉపయోగం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.

Updated Date - 2020-09-23T07:01:31+05:30 IST