392 మందికి డిగ్రీల ప్రదానం

ABN , First Publish Date - 2022-07-06T06:41:43+05:30 IST

శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10గంటలకు 11వ స్నాతకోత్సవం జరగనుందని వీసీ డాక్టర్‌ పద్మనాభరెడ్డి తెలిపారు.

392 మందికి డిగ్రీల ప్రదానం
మీడియాతో మాట్లాడుతున్న పద్మనాభరెడ్డి

37మందికి గోల్డ్‌, ఇద్దరికి రజతం, 

ఒకరికి క్యాష్‌ప్రైజు

వర్చువల్‌గా హాజరుకానున్న 

గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌

వీసీ డాక్టర్‌ వి.పద్మనాభరెడ్డి వెల్లడి


శ్రీవేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10గంటలకు 11వ స్నాతకోత్సవం జరగనుందని వీసీ డాక్టర్‌ పద్మనాభరెడ్డి తెలిపారు. మంగళవారం వర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూజీలో 281మందికి, పీజీలో 96మందికి, పీహెచ్‌డీ 15మందికి చొప్పున మొత్తం 392మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే 37మందికి బంగారు, ఇద్దరికి రజతం, ఒకరి క్యాష్‌ప్రైజు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇద్దరికి మెరిటోరియస్‌ టీచర్‌ అవార్డులు, ఒకరికి ఉత్తమ యువశాస్త్రవేత్త పురస్కారం, డాక్టర్‌ వి.పాండురంగారావు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, నీలకంఠాపురం ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం, డాక్టర్‌ వి.ప్రతా్‌పరెడ్డి ఉత్తమ పీజీ రీసెర్చ్‌ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌లో హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారని తెలిపారు. ముఖ్యఅతిథిగా తమిళనాడు యానిమల్‌ సైన్స్‌ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కేఎన్‌ సెల్వకుమార్‌ హాజరవుతారన్నారు. టీటీడీ సహకారంతో దేశీయ ఆవులలో పాల ఉత్పత్తి 10శాతం పెంపు, శ్రీవారి నైవేద్యంలో ఉపయోగించే నెయ్యి, వెన్న వంటివి వర్సిటీ సాంకేతిక సహకారంతో అందించేలా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో టీటీడీకి వర్సిటీ సహకారం అందిస్తుందని తెలిపారు. రిజిస్ర్టార్‌ డాక్టర్‌ వి.రవి, వెటర్నరీసైన్స్‌ డీన్‌ డాక్టర్‌ సర్జన్‌రావు, డెయిరీడీన్‌ డాక్టర్‌ జె.సురేష్‌, డీఈ డాక్టర్‌ వెంకటనాయుడు, ఏడీలు డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ ఆదిలక్ష్మమ్మ, మీడియా ఇన్‌చార్జి డాక్టర్‌ బి.రాంబాబునాయక్‌, ప్రొఫెసర్లు డాక్టర్‌ జగపతిరామయ్య, బీఆర్‌నాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-06T06:41:43+05:30 IST