Dehradun: అధికారులు ఫోన్లు స్విచాఫ్ చేస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-09-18T17:42:07+05:30 IST

భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు,కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు...

Dehradun: అధికారులు ఫోన్లు స్విచాఫ్ చేస్తే కఠిన చర్యలు

జిల్లా మేజిస్ట్రేట్ హెచ్చరిక 

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): భారీవర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు,కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల్లో తప్ప తమ ఫోన్లను స్విచాఫ్ చేయరాదని జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ రాజేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులు తమ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేస్తే వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లామెజిస్ట్రేట్ హెచ్చరించారు. కరోనా ప్రభావం ఇప్పటికీ ఉంది. దీంతోపాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వివిధ చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.


అటువంటి సంఘటనల సమయంలో బాధిత వ్యక్తులకు తక్షణ సహాయం, సేవలు చేయాల్సిన అవసరం ఉంది. విపత్తును పరిష్కరించడానికి, ఆ శాఖ అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఉంది. జిల్లా పరిపాలన అధికారులను ఫోన్ల ద్వారా సంప్రదించినప్పుడు, వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంటున్నారు.అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో జిల్లా అధికారులు మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయకూడదని అన్ని జిల్లా పరిపాలన అధికారులను జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించారు.జిల్లా పరిపాలన అధికారులు ఇప్పటికీ వారి మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించినట్లయితే, వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులో జిల్లా మెజిస్ట్రేట్ పేర్కొన్నారు.


Updated Date - 2021-09-18T17:42:07+05:30 IST