లక్ష్యం నెరవేరేనా?

ABN , First Publish Date - 2021-02-26T05:14:11+05:30 IST

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా నాలుగేళ్లలో రూ.75వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గత ఏడాది తొలి దఫా నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ఈ నిధులతో మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించింది. ఇందు కోసం పాడి పశువులు, మేకలు, గొర్రెలు యూనిట్లు నెలకొల్పి.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పాడి పశువులు, మేకలు, గొర్రెలు యూనిట్ల మంజూరు కోరుతూ అధిక సంఖ్యలో మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. దీంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది.

లక్ష్యం నెరవేరేనా?

- ‘వైఎస్సార్‌ చేయూత’కు బ్యాంకర్ల మోకాలడ్డు

- రుణాల మంజూరులో వెనుకడుగు

- దరఖాస్తుదారులకు తప్పని అవస్థలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాన్ని గత ఏడాది ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా నాలుగేళ్లలో రూ.75వేలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. గత ఏడాది తొలి దఫా నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ఈ నిధులతో మహిళలు స్వయం ఉపాధి పొందాలని సూచించింది. ఇందు కోసం పాడి పశువులు, మేకలు, గొర్రెలు యూనిట్లు నెలకొల్పి.. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పాడి పశువులు, మేకలు, గొర్రెలు యూనిట్ల మంజూరు కోరుతూ అధిక సంఖ్యలో మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. దీంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. 

 జిల్లాలో ఇదీ పరిస్థితి

వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా పాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గేదెలు, జీవక్రాంతి కింద గొర్రెలు, మేకల యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులు సూచించారు. ప్రభుత్వం తొలివిడత ఇచ్చిన రూ. 18,750 బ్యాంకులో జమ చేసిన తర్వాతనే బ్యాంకర్లు రుణం కింద రూ.56,250 చొప్పున మంజూరైంది. ఆ మొత్తం నగదు రూ. 75 వేలతో యూనిట్‌ ఏర్పాటు చేసుకోవాలి. రానున్న మూడేళ్లపాటు ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత కింద నేరుగా రూ.18,750 చొప్పున ఖాతాలో జమ చేస్తుంది. జిల్లాలో గేదెల యూనిట్ల కోసం 1,819 మంది, గొర్రెలు, మేకల యూనిట్లకుగాను 21,770 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ యూనిట్ల గ్రౌండింగ్‌కు సంబంధించి బ్యాంకర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదు. రుణాలు మంజూరుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో 1,543 మందికి గేదెల యూనిట్లు మాత్రమే గ్రౌండింగ్‌ చేశారు. ఇందులో కేవలం బ్యాంకు లింకేజీ కింద 75 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అలాగే గొర్రెలు, మేకల యూనిట్లు కేవలం 575 గ్రౌండింగ్‌ చేశారు. ఇప్పటివరకు 260 మందికి మాత్రమే బ్యాంకు లింకేజీ రుణం ఇచ్చారు. మిగతావారికి డీఆర్డీఏ అమలు చేస్తున్న ఉన్నతి, స్త్రీనిధి, సీఐఏఎఫ్‌ కింద యూనిట్లను గ్రౌండింగ్‌ చేశారు. 

 గ్రౌండింగ్‌లో వెనకడుగు....

లబ్ధిదారుడు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం సకాలంలో చెల్లించాలి. అలా అయితేనే ‘చేయూత’ సొమ్మును డ్రా చేసుకోవచ్చు. లేదంటే ఇచ్చిన రుణం కింద బ్యాంకర్లు జమ చేసుకునేలా డీఆర్డీఏ అధికారులు అంగీకరించినట్లు సమాచారం. పథకం ప్రారంభం నుంచే రుణాల మంజూరుకు బ్యాంకర్ల చుట్టూ డీఆర్డీఏ మండల ఏపీఎంలు, సీసీలు తిరిగారు. కాలయాపన చేయడంతో యూనిట్ల గ్రౌండింగ్‌లో వెనకబడ్డారు. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

 కలెక్టర్‌ ఆదేశాలతో.. 

మేకలు, గొర్రెలు, గేదెల యూనిట్ల గ్రౌండింగ్‌ విషయమై బ్యాంకర్లతో కలెక్టర్‌ నివాస్‌ గురువారం సమావేశమయ్యారు. మార్చి నెలాఖరుకి 11వేల యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తిచేయాలని.. తక్షణమే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. రోజుకి బ్యాంకు పరిధిలో ఒకటి చేసినా.. రోజుకి 50 లక్ష్యం పూర్తవుతుందని సూచించారు. ఇకనైనా వేగం పెరిగి పరిస్థితి మెరుగవుతుందని ఆశిస్తున్నాం. 

- ఈశ్వరరావు, జేడీ, పశుసంవర్థకశాఖ

---------------------

యూనిట్లు దరఖాస్తులు గ్రౌండింగ్‌ బ్యాంకు రుణాలు

------------------------------------------------------------------------------

గేదెలు 1,819 1,543 75 మందికి

గొర్రెలు, మేకలు 21,770 575         260మందికి

==========================

Updated Date - 2021-02-26T05:14:11+05:30 IST