‘టెలిగ్రామ్‌’లోనూ డిలీట్‌ ఆప్షన్‌

ABN , First Publish Date - 2021-02-27T09:21:53+05:30 IST

‘టెలిగ్రామ్‌’ యాప్‌ కొత్తగా డిలీట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సెండర్‌ పంపిన మెసేజ్‌ నిర్దేశిత గడవు తరవాత ఆటోమేటిక్‌గా డీలిట్‌ అవుతుంది. ఆ సమయాన్ని మెసేజ్‌ను పంపిన సెండరే సెట్‌ చేస్తారు.

‘టెలిగ్రామ్‌’లోనూ డిలీట్‌ ఆప్షన్‌

‘టెలిగ్రామ్‌’ యాప్‌ కొత్తగా డిలీట్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సెండర్‌ పంపిన మెసేజ్‌ నిర్దేశిత గడవు తరవాత ఆటోమేటిక్‌గా డీలిట్‌ అవుతుంది. ఆ సమయాన్ని మెసేజ్‌ను పంపిన సెండరే సెట్‌ చేస్తారు. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ వెర్షన్లలో ఇది లభ్యమవుతుంది. ఇంతకు మునుపు ఇది సీక్రెట్‌ ఛాట్స్‌లో మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని రెగ్యులర్‌కూ వర్తింపజేశారు. ఆటో-డిలీట్‌ టైమ్‌ సెట్‌ చేసి ఏ సమయంలోనైనా మెసేజ్‌ను సెండర్‌ ఇప్పుడు పంపుకోవచ్చు. సరిగ్గా ఆ సమయం కాగానే ఇటు సెండర్‌ అటు రిసీవర్‌ చాట్‌ విండో నుంచి  ఆ మెసేజ్‌ డిలీట్‌ అవుతుంది. వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లలో ఈ సదుపాయం ఉంటుంది. 


అయితే, గ్రూపుల్లో మాత్రం అడ్మిన్‌ మాత్రమే టైమ్‌ని నిర్దేశించగలుగుతారు. ఇందులో ఇంకో విశేషం ఏమిటంటే, సదరు మెసేజ్‌కు పెట్టిన గడవును తెలుసుకోవచ్చు. అండ్రాయిడ్‌లో ఐకాన్‌, ఐఔస్‌లో మెసేజ్‌ను నొక్కిపెట్డడం ద్వారా నిర్దేశించిన టైమ్‌ను తెలుసుకోవచ్చు. అలా టైమ్‌ పెట్టిన మెసేజ్‌లకు తప్ప మిగిలిన వాటిపై దీని ప్రభావం ఏమీ ఉండదు. ఇదేకాకుండా ఇన్వైటీ లింకులు, వాటికి క్యుఆర్‌ కోడ్‌లు, బ్రాడ్‌కాస్ట్‌ గ్రూపులు వంటివి కూడా ‘టెలిగ్రామ్‌’ కలిపింది.

Updated Date - 2021-02-27T09:21:53+05:30 IST