సినీఫక్కీలో ఒక బడా వ్యాపారికి చెందిన రూ.50 లక్షల దొంగతనం.. మాస్టర్ మైండ్ ఎవరంటే..

ABN , First Publish Date - 2022-01-06T06:55:35+05:30 IST

ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌కు చెందిన రూ.50 లక్షలు తీసుకొని అతని వద్ద పనిచేసే ఇద్దరు దారిలో వెళుతుండగా.. మరో ఇద్దరు దుండగలు దాడి చేశారు. ముందు తుపాకీతో బెదిరించారు. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో దుండగలు గాల్లో కాల్పులు జరిపారు. ఆ తరువాత డబ్బు కోసం ఆ ఇద్దరినీ చితకబాదారు. వారి వద్ద డబ్బుతో నిండిన బ్యాగు తీసుకొని బైక్‌పై పరారయ్యారు...

సినీఫక్కీలో ఒక బడా వ్యాపారికి చెందిన రూ.50 లక్షల దొంగతనం.. మాస్టర్ మైండ్ ఎవరంటే..

ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌కు చెందిన రూ.50 లక్షలు తీసుకొని అతని  వద్ద పనిచేసే ఇద్దరు దారిలో వెళుతుండగా.. మరో ఇద్దరు దుండగలు దాడి చేశారు. ముందు తుపాకీతో బెదిరించారు. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో దుండగలు గాల్లో కాల్పులు జరిపారు.  ఆ తరువాత డబ్బు కోసం ఆ ఇద్దరినీ చితకబాదారు. వారి వద్ద డబ్బుతో నిండిన బ్యాగు తీసుకొని బైక్‌పై పరారయ్యారు. ఈ దొంగతనం గురించి పోలీసులు దర్యాప్తు చేసి ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ప్రశ్నించగా.. మాస్టర్ మైండ్ ఎవరో తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే..


ఢిల్లీకి చెందిన మోహన్ సింగ్ అనే బడా వ్యాపారి తన వద్ద పనిచేసే లక్కీ, హర్విందర్ సింగ్‌లను నగరంలోని వికాస్ పురి ప్రాంతానికి పంపాడు. అక్కడ నుంచి రూ.50 లక్షలు క్యాష్ తీసుకొని రావాలని చెప్పాడు. తమ బాస్ చెప్పినట్టుగా లక్కీ, హర్విందర్ సింగ్‌లు ఒక బ్యాగు నిండా రూ.50 లక్షల క్యాష్ తీసుకొని రోడ్డుపై తాము వచ్చిన కారులో ఎక్కబోయారు. అంతలో ఇద్దరు దుండగలు తుపాకీతో అక్కడికి వచ్చారు. తమకు ఆ డబ్బుతో నిండిన బ్యాగుని ఇచ్చేయాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. కానీ లక్కీ, హర్విందర్ సింగ్‌లు అందుకు నిరాకరించారు. దీంతో దుండగులు ముందుగా గాల్లో కాల్పులు చేసి భయపడించారు.. అయినా డబ్బు ఇవ్వకపోవడంతో హెల్మెట్, తుపాకీతో లక్కీ, హర్విందర్ సింగ్‌లను చితకబాది డబ్బుని లాక్కొన్నారు. ఇద్దరు దుండగలు బ్యాగు తీసుకొని ఒక బైక్‌పై పారిపోయారు.


ఈ దొంగతనం గురించి మోహన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టపగలే దొంగతనం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవి వీడియో ఆధారంగా దొంగలు పారిపోయిన బైక్ నెంబర్ గురించి ఆరా తీశారు. ఆ బైక్ దొంగతనం చేయబడిందని తెలిసింది. దీంతో ఆ బైక్ తీసుకొని ఏదారిలో వెళ్లారో ఆ దిశలో ఉన్న అన్ని సిసిటీవి వీడియోలను పోలీసులు పరిశీలించారు. కానీ దుండగలు ఆ బైక్‌పై కేవలం ఒక కిలోమీటర్ దూరం వెళ్లారని తెలిసింది. ఆ ఇద్దరు దుండగులు బైక్‌ను పడేసి ఒక కారులో బయలుదేరారు. ఆ కారు నెంబర్ ట్రాక్ చేసి అందులో ఉన్న మూడో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ మూడో వ్యక్తి కారు తీసుకొని దొంగల కోసం అక్కడ ఎదురుచూస్తూ నిలబడ్డాడు. అంటే ఇదంతా పక్కా ప్లాన్. ఆ కారు నడిపిన మూడో వ్యక్తి పేరు మన్‌ప్రీత్ సైనీ. 


మన్‌ప్రీత్ సైనీని పోలీసుల ప్రశ్నించగా.. అతడు విషయం మొత్తం చెప్పాడు. ఆ ఇద్దరు దొంగల పేర్లు సుభాష్, ప్రదీప్ అని తెలిసింది. అసలు ఈ ప్లాన్ ఎవరు వేశారు.. దీనికి మాస్టర్ మైండ్ ఎవరు అని పోలీసుల ప్రశ్నించగా.. అప్పుడు మన్‌ప్రీత్ చెప్పింది విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ప్లాన్ వేసింది మరెవరో కాదు.. బిజినెస్ మ్యాన్ మోహన్ సింగ్ సెక్రటరీ భూపేంద్ర. 


రూ. 50 లక్షలు తీసుకొని మోహన్ సింగ్ అనుచరులు లక్కీ, హర్విందర్ సింగ్‌లు బయలుదేరుతున్నారని భూపేంద్ర ఒకరోజు ముందుగా.. మన్‌ప్రీత్‌కు సమాచారమిచ్చాడు. దీంతో దొంగతనం ప్లాన్ పక్కాగా వేసి డబ్బు కాజేశామని మన్‌ప్రీత్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు ఆ ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు భూపేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-01-06T06:55:35+05:30 IST