
ముంబై : టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన Rajastan Royals.. Delhi capitalsకు ఒక మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ(50), దేవ్ధూత్ పడిక్కల్(48) రాణించడంలో నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు నమోదు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 161 పరుగులుగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్లలో యశస్వి జైస్వాల్ (19), జాస్ బట్లర్ (7), రవిచంద్రన్ అశ్విన్(50), దేవ్ధూత్ పడిక్కల్(48), సంజూశాంసన్(6), రియాన్ పరాగ్(9), వాండెర్ డస్సెన్(12 నాటౌట్), ట్రెంట్ బౌల్ట్ (3 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో చేతన్ సర్కారియా 2 వికెట్లు, అన్రిచ్ నొర్ట్జే 2 వికెట్లు, మిచెల్ మార్ష్ 2 చొప్పున వికెట్లు తీశారు.