కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్
ABN , First Publish Date - 2022-04-23T00:43:11+05:30 IST
ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్
ముంబై: ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కాబట్టి పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్ గెలిస్తే పది పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఆ స్థానంలో ఉన్న బెంగళూరు మూడో స్థానానికి దిగజారుతుంది.
ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ కేపిట్స్ రేసులో నిలవాలంటే గెలుపు తప్పనిసరి. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.