
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా Lucknow Super Gaints, Delhi Capitals జట్ల మధ్య జరుగుతున్న IPL మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. లక్నో టీంకు ఓపెనర్లు డీ కాక్, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించారు. 42 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో డీ కాక్ ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా నిలకడగా ఆడి రాహుల్‌తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించగా, దీపక్ హుడా 52 పరుగులు చేసి లక్నో స్కోర్‌లో తన వంతు పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ కాగా, దీపక్ హుడా కూడా శార్దూల్ బౌలింగ్‌లోనే వికెట్ చేజార్చుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మూడు వికెట్లూ శార్దూల్ ఠాకూర్‌కే దక్కాయి. అక్సర్ పటేల్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు.