
ముంబై: ఢిల్లీ కేపిట్స్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్సింగ్స్‌తో స్కోరు బోర్డు పరుగులు తీసింది. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీలకు తరలిస్తూ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు.
మొత్తంగా 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఇషాన్ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు.
ఈ క్రమంలో 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన రోహిత్.. కుల్దీప్ యాదవ్ బౌలింగులో రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చిన పెవిలియన్ చేరాడు. అన్మోల్ ప్రీత్ 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. తిలక్ యాదవ్ (22) కాసేపు క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారీ స్కోరు సాధించలేకపోయాడు.
మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన ఇషాన్ మాత్రం బ్యాట్‌కు పనిచెబుతూ బంతులను బౌండరీలకు తరలించాడు. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 3, ఖలీల్ అహ్మద్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఇవి కూడా చదవండి