ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఢిల్లీ కోర్టులో చిదంబరానికి ఊరట

ABN , First Publish Date - 2021-06-23T04:37:55+05:30 IST

మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కీలక నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసు విచారణను రెండు వారాల...

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: ఢిల్లీ కోర్టులో చిదంబరానికి ఊరట

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కీలక నిందితుడిగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఢిల్లీ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9 వరకు వాయిదా వేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అత్యవసర కేసులను మాత్రమే కోర్టు విచారిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో 2019 ఆగస్టు 21న సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది అక్టోబర్ 16న ఓ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆరు రోజులకు అక్టోబర్ 22న సుప్రీంకోర్టు సీబీఐ కేసులో చిదంబరానికి బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 4న ఈడీ కేసులో కూడా ఆయనకు బెయిల్ వచ్చింది.

Updated Date - 2021-06-23T04:37:55+05:30 IST