ఢిల్లీలో కొత్తగా 7,498 కరోనా కేసులు నమోదు, 29 మంది మృతి

Published: Wed, 26 Jan 2022 20:39:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఢిల్లీలో కొత్తగా 7,498 కరోనా కేసులు నమోదు, 29 మంది మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం రోజు కొత్తగా 7,498 కేసులు నమోదవడంతో ఢిల్లీలో కోవిడ్-19 సంఖ్య ఒక రోజులో 24శాతం పెరిగిందని వైద్య అధికారులు పేర్కొన్నారు. గత 24 గంటల్లో ఢిల్లీలో బుధవారం కోవిడ్ వల్ల 29 మంది మరణించినట్లు వైద్య అధికారులు తెలిపారు. 11,164 మంది రోగులు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ముఖ్యంగా ఇది మంగళవారం 6,028 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నిన్నటి కోవిడ్ పాజిటివిటీ రేటు 10.55శాతం మాదిరిగానే ఈ రోజు పాజిటివిటీ రేటు 10.59శాతం వద్ద నమోదైంది. ఢిల్లీలో 38,315 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని,గత 24 గంటల్లో 70,000 కోవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య అధికారులు చెప్పారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.