ఢిల్లీలో తగ్గిన కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2021-05-09T22:25:40+05:30 IST

ఢిల్లీలో తగ్గిన కోవిడ్ కేసులు

ఢిల్లీలో తగ్గిన కోవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో రోజువారీ కోవిడ్-19 కేసులు 13,336కి పడిపోయాయని, కోవిడ్ మరణాలు కూడా 300 కన్నా తక్కువగా నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. 17,000 కొత్త కోవిడ్-19 కేసులను నమోదు చేసిన ఒక రోజు తరువాత, ఢిల్లీలో ఆదివారం రోజు కొత్తగా 13,336 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 273 మరణాలతో దేశ రాజధానిలో రోజువారీ మరణాల సంఖ్య 300 కంటే తక్కువగా ఉంది. ఢిల్లీలో రోజువారీ పాజిటివిటీ రేటు 21.67 శాతం వద్ద ఉందని ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-09T22:25:40+05:30 IST