బీజేపీ, ఆప్ హోరాహోరీ ప్రచారం..

ABN , First Publish Date - 2020-02-02T14:30:38+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో దేశ రాజధానిలో ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ..

బీజేపీ, ఆప్ హోరాహోరీ ప్రచారం..

అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో దేశ రాజధానిలో ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్‌షోలతో దూసుకుపోతుంటే, బీజేపీ కీలక మంత్రులంతా ర్యాలీలతో ఊదరగొడుతున్నారు. ఆదివారం ఈ జోరు కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు బహిరంగ సభల్లో పాల్గోనున్నారు.

మరోవైపు, కైరారి, ముండ్కా, విశ్వాస్ నగర్, లక్ష్మీనగర్, రిథాలాలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌షాల్లో పాల్గొంటున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 8న పోలింగ్ జరుగనుండగా, 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Updated Date - 2020-02-02T14:30:38+05:30 IST