ఢిల్లీలో తెరుచుకోనున్న స్కూళ్లు.. ఆప్ సర్కార్ సంకేతాలు

ABN , First Publish Date - 2022-01-27T02:05:32+05:30 IST

దేశ రాజధానిలో మళ్లీ స్కూళ్లు తెరిచేందుకు ఆప్ సర్కార్ సానుకూల ..

ఢిల్లీలో తెరుచుకోనున్న స్కూళ్లు.. ఆప్ సర్కార్ సంకేతాలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మళ్లీ స్కూళ్లు తెరిచేందుకు ఆప్ సర్కార్ సానుకూల సంకేతాలిచ్చింది. "అతి జాగ్రత్తల వల్ల పిల్లలకు నష్టం జరుగుతుంది"అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారంనాడు అన్నారు. విద్యార్థుల్లో సహజంగా ఉండే సామాజిక అనుబంధాలు మరింత దెబ్బతినకుండా చూసేందుకు స్కూళ్లు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పారు.


కోవిడ్ భయాల్లో భాగంగా స్కూళ్లు మూసివేయడం వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినడమే కాకుండా వారి మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుందని సిసోడియా పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లడం, ప్లే గ్రౌండ్స్‌లో ఆడుకోవడానికి బదులుగా రెండేళ్లుగా పిల్లలు ఇళ్లకు, తమ గదులకు, మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని అన్నారు. పిల్లలకు కోవిడ్ హాని చేయదని పలు సర్వేలు కూడా ఇప్పుడు నిర్ధారించాయని, పైగా ఇది పిల్లలు పరీక్షలకు సిద్ధమయ్యే సమయమని చెప్పారు. కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా గత డిసెంబర్ నుంచి ఢిల్లీలో స్కూళ్లు మూసేశారు.

Updated Date - 2022-01-27T02:05:32+05:30 IST