Padma awards: వైద్యులు,ఆరోగ్య కార్యకర్తల పేర్ల ప్రతిపాదన

ABN , First Publish Date - 2021-07-27T18:48:56+05:30 IST

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలినపుడు విశిష్ఠ వైద్యసేవలందించిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లను పద్మ అవార్డుల కోసం ప్రతిపాదిస్తామని...

Padma awards: వైద్యులు,ఆరోగ్య కార్యకర్తల పేర్ల ప్రతిపాదన

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ వెల్లడి

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రబలినపుడు విశిష్ఠ వైద్యసేవలందించిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల పేర్లను పద్మ అవార్డుల కోసం ప్రతిపాదిస్తామని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. కరోనా విపత్తు సమయంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అందించిన సేవలకు గుర్తింపుగా వారి పేర్లను పద్మ అవార్డుల కోసం ప్రతిపాదించాలని తాము ప్రజలను కోరామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఆగస్టు 15వతేదీ వరకు ప్రజల నుంచి పద్మ అవార్డులకు ప్రతిపాదనలు ఆహ్వానించి, వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి తుది జాబితాను రూపొందించి వాటిని కేంద్రానికి పంపిస్తామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. సెప్టెంబరు 15వతేదీ వరకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపిస్తామని సీఎం వివరించారు. 


Updated Date - 2021-07-27T18:48:56+05:30 IST