13 ఏళ్ల వయసులో పెళ్లి.. మేజర్ అయినా కాపురానికి తీసుకెళ్లని భర్త.. 10 ఏళ్ల తర్వాత ఆమెకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని తెలిసి..

ABN , First Publish Date - 2021-11-09T19:30:15+05:30 IST

వారిద్దరికీ చిన్న వయసులోనే పెళ్లై పోయింది.. యువతికి మైనారిటీ తీరకపోవడంతో భర్త ఆమెను కాపురానికి తీసుకెళ్ల లేదు..

13 ఏళ్ల వయసులో పెళ్లి.. మేజర్ అయినా కాపురానికి తీసుకెళ్లని భర్త.. 10 ఏళ్ల తర్వాత ఆమెకు ప్రభుత్వోద్యోగం వచ్చిందని తెలిసి..

వారిద్దరికీ చిన్న వయసులోనే పెళ్లై పోయింది.. యువతికి మైనారిటీ తీరకపోవడంతో భర్త ఆమెను కాపురానికి తీసుకెళ్ల లేదు.. ఆమె మేజర్ అయిన తర్వాత కూడా ఆ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు.. ఎంత అడిగినా ఆమెను ఇంటికి తీసుకెళ్ల లేదు.. దీంతో పుట్టింట్లోనే ఉండిపోయిన యువతి బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.. ఆమె సంపాదన మీద ఆశ పడిన భర్త ఆమెకు చేరువయ్యాడు.. ఆమె డబ్బులతో తాగుతూ ఆమెను హింసించడం ప్రారంభించాడు.. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది.. కోర్టు ఆమెకు తాజాగా విడాకులు మంజూరు చేసింది. 


ఉద్యోగం వచ్చిన తర్వాత తన సంపాదనపై ఆశతోనే భర్త తన దగ్గరకు వచ్చాడని, రోజు తాగి వచ్చి చిత్ర హింసలు పెడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ బాధిత మహిళ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అయితే ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. దీంతో సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మహిళకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సదరు వ్యక్తికి భార్యపై ఎలాంటి ప్రేమా లేదని, కేవలం ఆమె సంపాదన మీద ఆధారపడి బతుకుదామని చూస్తున్నాడని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బాధిత మహిళ అతడి వల్ల మానసికంగా ఇబ్బందులు పడిందని, ఇది కూడా హింసేనని న్యాయమూర్తి పేర్కొన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు మంజూరు చేస్తున్నట్టు తీర్పునిచ్చారు. 

Updated Date - 2021-11-09T19:30:15+05:30 IST