Delhi Liquor Scam: సీబీఐ దూకుడు... తొలి అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-28T02:47:46+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‎పై కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI) తాజాగా....

Delhi Liquor Scam: సీబీఐ దూకుడు... తొలి అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు (Delhi Liquor Scam)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్‎పై కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI) తాజాగా మరింత దూకుడు పెంచింది. కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నయర్‌ (Vijay Nayar)ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.  నిందితుడు విజయ్ నయర్.. ఓన్లీ మoచ్ లౌడర్ కంపెనీకి సీఈఓగా పని చేశారు. ముంబై‎కు చెందిన విజయ్ నయర్‌ను లిక్కర్ స్కామ్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఐదవ నిందితుడిగా చేర్చారు. విజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు.. ఆయన్ను అరెస్ట్ చేశారు.  ఈ కేసులో తొలి అరెస్ట్ కావడంతో మిగిలిన నిందితుల్లో గుబులు మొదలైంది. 

Updated Date - 2022-09-28T02:47:46+05:30 IST