ఢిల్లీ, మహారాష్ట్రలను మరింతగా వణికిస్తున్న కరోనా!

ABN , First Publish Date - 2021-03-06T11:47:34+05:30 IST

దేశరాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లతో పాటు...

ఢిల్లీ, మహారాష్ట్రలను మరింతగా వణికిస్తున్న కరోనా!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లతో పాటు పలు రాష్ట్రాలలో మరోమారు కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 312 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికిముందు జనవరి 14న 340 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంట్లలో కరోనా కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 10,918కి చేరింది. 


ఇదేవిధంగా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10 వేలకు మించి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 53 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,98,399కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 52,393కు చేరింది. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,779గా ఉండగా, ఇది జనవరి 23 తరువాత అత్యధిక యాక్టివ్ కేసుల సంఖ్య. జనవరి 23న యాక్టివ్ కేసుల సంఖ్య 1,880గా ఉంది. కాగా మహారాష్ట్రలో కొత్తగా 10,216 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 6,467 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.52 శాతంగా ఉంది. ఇక పంజాబ్ విషయానికొస్తే కొత్తగా 818 మందికి కరోనా సోకింది. ముఖ్యంగా జలంధర్ జిల్లాలో కొత్తగా 134 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-03-06T11:47:34+05:30 IST