Honeytrap: అపరిచిత మహిళ అసభ్యకరంగా వీడియో‌కాల్

ABN , First Publish Date - 2022-09-21T16:08:01+05:30 IST

ఓ అపరిచిత మహిళతో(stranger woman) హనీట్రాప్(Honeytrap) చేయించి, ఆపై బెదిరించి డబ్బు గుంజిన ఘరానా సైబర్ ముఠా...

Honeytrap: అపరిచిత మహిళ అసభ్యకరంగా వీడియో‌కాల్

ఆపై డబ్బు వసూలు.. గుట్టును రట్టు చేసిన పోలీసులు

న్యూఢిల్లీ: ఓ అపరిచిత మహిళతో(stranger woman) హనీట్రాప్(Honeytrap) చేయించి, ఆపై బెదిరించి డబ్బు గుంజిన ఘరానా సైబర్ హనీట్రాప్ ముఠా బాగోతాన్ని ఢిల్లీ పోలీసులు బట్టబయలు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి అపరిచిత మహిళ గుర్తుతెలియని నంబరు నుంచి అసభ్యకర వాట్సాప్ వీడియో కాల్(VIDEO CALL) వచ్చింది. ‘‘మీతో రాత్రి గడపాలని ఉందంటూ’’ మహిళ అర్ధనగ్నంగా, అసభ్యంగా ఫోనులో హస్కీ వాయిస్‌తో మాట్లాడింది.ఢిల్లీ యువకుడు అమ్మాయితో కొంతసేపు మాట్లాడి, ఆపై ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాడు.అనంతరం పూణే నుంచి తాను పోలీసు అధికారి అరుణ్ రావత్ మాట్లాడుతున్నట్లు బాధితుడికి ఫోన్ వచ్చింది. 


ఫోన్ మాట్లాడిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని రావత్ చెప్పాడు. ‘‘మహిళ కాల్ లాగ్‌లో మీ మొబైల్ నంబర్ కనుగొన్నామని’’పోలీసు అధికారిని అని చెప్పుకుంటూ బెదిరించాడు.అనంతరం పూణేకు చెందిన మరో పోలీసు ఎస్ఐ విక్రమ్ రాథోడ్ అంటూ బెదిరించాడు. కేసు పెడతామంటూ బెదిరించి మహిళతో మాట్లాడిన బాధిత యువకుడి నుంచి వివిధ బ్యాంకు ఖాతాల్లోకి రూ.18 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.బాధితుడికి మరో మొబైల్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకుని ముంబైకి రమ్మని కోరాడు. 


ఫిర్యాదుదారు మళ్లీ పైన పేర్కొన్న విక్రమ్ రాథోడ్‌ను సంప్రదించగా, మరో రూ.3 లక్షలు చెల్లించాలని అడిగాడు. ఈ తరుణంలో ఫిర్యాదుదారు అయిన యువకుడు మోసపోయినట్లు గ్రహించి ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌ కు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో మొబైల్ నంబర్ల కాల్ వివరాల రికార్డులు లభించాయి.నిందితుడిని అల్వార్ తహసీల్ రామ్‌గఢ్‌లోని అలవార నివాసి ముస్కీమ్ (20)గా గుర్తించారు. అనంతరం దాడులు నిర్వహించి నిందితుడైన ముస్కీమ్ ను పోలీసు బృందం పట్టుకుంది.


పోలీసుల విచారణలో ముస్త్కీమ్ ఆన్‌లైన్ మోసగాళ్ల ముఠాలో భాగమని తేలింది. ఈ ముఠా 13 సిమ్ కార్డులను ఉపయోగించిందని దర్యాప్తులో వెలుగుచూసింది. ఈ ముఠాలో నిందితుడైన ముస్కీమ్‌ను అరెస్టు చేసి ద్వారకా కోర్టులో హాజరుపర్చగా,అతన్ని రెండు రోజుల పోలీసు రిమాండుకు పంపారు. 


Updated Date - 2022-09-21T16:08:01+05:30 IST