ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఇంట్లో ED సోదాలు

ABN , First Publish Date - 2022-06-06T17:59:36+05:30 IST

మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన వారం రోజుల తర్వాత ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్(Satyendar Jain) ఇంట్లో ఈడీ సోమవారం సోదాలు నిర్వహించింది.

ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఇంట్లో ED సోదాలు

న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన వారం రోజుల తర్వాత ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్(Satyendar Jain) ఇంట్లో ఈడీ(ED) సోమవారం సోదాలు(Raids) నిర్వహించింది. ఢిల్లీలోని ఆయన నివాసంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిపినట్టు ఈడీ అధికారులు తెలిపాయి. బీజేపీ(BJP), ఆప్(AAP) పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. గతవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Kejrival) స్పందిస్తూ.. కావాలంటే ఆప్ నేతలందర్ని అరెస్ట్ చేసుకోండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు. తదుపరి టార్గెట్ లిస్ట్‌లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఉన్నారని, త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తారంటూ తమకు సమాచారం ఉందని కేజ్రీవాల్ మండిపడిన విషయం తెలిసిందే.


కాగా 57 ఏళ్ల ఆప్ లీడర్ సత్యేందర్ జైన్‌ను మే 30న ఈడీ అరెస్ట్ చేసింది. మనీల్యాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం అరెస్ట్ చేసినట్టు అధికారులు ప్రకటించాకగ. కాగా 2017లో సత్యేందర్ జైన్, ఆయన సతీమణి పూనమ్ జైన్ ఆదాయానికి మించి రూ.1.47 కోట్ల ఆస్తులు కలిగివుండడంపై సీబీఐ దర్యాప్తు చేసింది. సీబీఐ దర్యాప్తు ఆధారంగా ఈడీ తాజాగా కేసు నమోదు చేసింది. దంపతుల ఆదాయం కంటే రెట్టింపు ఆస్తులను కలిగివున్నారని వెల్లడించింది.

Updated Date - 2022-06-06T17:59:36+05:30 IST