Infection Is Decreasing అన్‌లాక్ తరువాత కూడా రాజధానిలో తగ్గుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-11T14:42:00+05:30 IST

కరోనా కేసులు తగ్గిన నేపధ్యంలో ఢిల్లీలో...

Infection Is Decreasing అన్‌లాక్ తరువాత కూడా రాజధానిలో తగ్గుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: corona in delhi కరోనా కేసులు తగ్గిన నేపధ్యంలో ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ నేపధ్యంలో చాలా సంస్థలు తెరుచుకున్నాయి. కాగా గడచిన వారం రోజుల కరోనా గణాంకాలను పరిశీలిస్తే కేసులలో పెరుగుదల కనిపించకపోవడం గమనార్హం. గడచిన వారం రోజులలో ఢిల్లీలో రోజువారీ కేసుల సంఖ్య వంద దాటకపోవడం విశేషం.


దీనిని గమనించిన వైద్య నిపుణులు దేశ రాజధానిలో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదని చెబుతున్నారు. దీనికితోడు ఢిల్లీవాసులు కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్నారని అందుకే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందన్నారు. ఇదేవిధంగా ప్రజలంతా వ్యవహరిస్తే కరోనా థర్ఢ్‌వేవ్ రాదని చెబుతున్నారు. ఢిల్లీలో గడచిన వారంలో మొత్తం 570 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన కరోనా కేసులలో ఇదే అత్యల్పం. దీనికి ముందు వారంలో మొత్తం 614 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వారంలో కరోనా కేసులు వ్యాప్తి రేటు 0.15 కన్నా తక్కువగా ఉంది. ఢిల్లీలో కరోనా కేసుల తగ్గుదల గురించి ఎయిమ్స్ డాక్టర్ యుద్ధవీర్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీలో కరోనా సెకెండ్ వేవ్‌లో సుమారు 80 శాతం జనాభాకు వైరస్ సంక్రమించడంతో, వారిలో యాంటీబాడీలు తయారయ్యాయని అందుకే కరోనా వ్యాప్తికి అడ్డుకట్టపడిందని తెలిపారు. 

Updated Date - 2021-07-11T14:42:00+05:30 IST