బలవంతంగా పెళ్లాడేందుకు బాలిక కిడ్నాప్..యువకుడి అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-12T16:03:31+05:30 IST

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన బాలికను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేసిన యువకుడిని న్యూఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.....

బలవంతంగా పెళ్లాడేందుకు బాలిక కిడ్నాప్..యువకుడి అరెస్ట్

న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన బాలికను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు కిడ్నాప్ చేసిన యువకుడిని న్యూఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని రత్నాకి గ్రామానికి చెందిన షోయబ్ ఖాన్‌కు 15 ఏళ్ల మైనర్ బాలిక ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అక్టోబరు 22వతేదీన  షోయబ్ ఖాన్ బాలికను బలవంతంగా పెళ్లాడేందుకు కిడ్నాప్ చేసి బీహార్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీకి తీసుకువెళ్లాడు. బాలిక కిడ్నాప్ కు గురైందంటూ బాలిక తండ్రి రాజౌరి గార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


పోలీసులు ఫేస్ బుక్, మెసెంబజర్, వాట్సాప్ ఖాతాలను పరిశీలించగా ఎస్ కె సిన్హా అనే సోషల్ మీడియా ఖాతా నుంచి తరచూ బాలికతో ఛాటింగు చేసినట్లు వెల్లడైంది. ఎస్ కె సిన్హా పేరుతో షోయబ్ ఖాన్ ఫేస్ బుక్ ఖాతా సృష్టించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. షోయబ్ ఖాన్ తన కుటుంబంతో పరారీలో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ నకు గురైన బాలిక బదర్పూర్ సరిహద్దు వద్ద ఆటోరిక్షాలో కనిపించింది. నిందితుడు తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేశాడని బాలిక పోలీసులకు చెప్పింది. బాలిక ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు షోయబ్ ఖాన్ ను బదర్ పూర్ సరిహద్దుల్లో అరెస్టు చేశారు. 

Updated Date - 2020-12-12T16:03:31+05:30 IST